Sunday

యోగా (ప్రాణాయామం)

ప్రశాంతమైన మనసుతో పద్మాసనం లేదా సుఖాసనం లేదా వజ్రాసనంలో కూర్చుని మూడు నాలుగు దీర్ఘశ్వాసల అనంతరం ప్రాణాయామం సాధన చేయాలి. ప్రాణాయామంలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి.
రేచకం : శ్వాసను బయటికి వదలటం
పూరకం : శ్వాసను లోపలికి తీసుకోవటం
కుంభకం : అనగా శ్వాసను నిలిపి వేయడం. కుంభకం రెండు రకాలు, శ్వాస తీసుకుని లోపలే గాలిని ఆపడాన్ని అంతర కుంభకమని, శ్వాస విడిచిపెట్టి గాలిని బయట నిలిపివేసే ప్రక్రియను బహిర్కుంభకమని అంటారు.
అంటే ముందుగా శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసి కొన్ని సెకన్ల పాటు బహిర్కుంభకం దశలో నిలిపి తిరిగి శ్వాసను పూర్తిగా తీసుకుని ఇప్పుడు అంతర కుంభకం దశలో కొన్ని సెకన్ల పాటు ఉండి తిరిగి శ్వాసను నెమ్మదిగా వదలాలి. ఇలా ఒకసారి చేసినపుడు ప్రాణాయామంలో ఒక చక్రం పూర్తయినట్టవుతుంది. ఇలా ప్రాణాయామాన్ని 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు సాధన చెయ్యాలి.
లాభాలు 
ప్రాణయామంలో దీర్ఘశ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకొని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల రక్తమూ, నాడులు శుద్ధి అవుతాయి. ఒత్తిడిని జయించడానికి అత్యుత్తమమైన మార్గం ప్రాణాయామం. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

0 comments:

Post a Comment