మనసంటే అవసరాన్ని బట్టి ఇచ్చుకునేది ... అవకాశాన్ని బట్టి మార్చుకునేది అనుకునే ఈ రోజుల్లో ... సినిమా వాళ్ల ప్రేమలు నిలకడగా వుండాలని ఆశిస్తే అమాయకత్వమే అవుతుంది. సినిమా ప్రపంచంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమనూ - తెగతెంపులను కూడా ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఆసక్తిగా గమనిస్తుంటారు. సినీ తారల ప్రేమాయణాలు టాలీవుడ్ లో సాఫీగా సాగిపోతే ... బాలీవుడ్ లో మాత్రం ఈ తరహా ప్రేమాయణాలు వీలైనంత ఎక్కువ సందడి చేస్తాయి. అక్కడి హీరోల్లో కొందరు జోడు మార్చినంత ఈజీగా జోడీని మార్చేస్తుంటారు.
ఇక హీరోయిన్లు కూడా మనీ పరుసు మార్చినంత తేలికగా మనసు మార్చేసుకుంటూ ఉంటారు. ఇక వీళ్లు ఎవరినైతే మొదట ప్రేమించి దూరమౌతారో ... తిరిగి వాళ్ల పంచకే చేరుతోన్న సందర్భాలు ఇటీవల ఎక్కువౌతున్నాయి. విడిపోయినప్పుడు ఆ కాంబినేషన్లో సినిమాలు చేయడానికి ససేమిరా అన్న వీళ్లు, తిరిగి కలిశాకా ఆఫరంటూ రావాలేగాని సైలెంట్ గా సైన్ చేసేస్తారు.
ఇందుకు ఎగ్జాంపుల్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ ల ప్రేమను తీసుకోవచ్చు. ఆ ఉదాహరణ ఇంకాస్త దగ్గరగా వుంటే బావుంటుందనుకుంటే, కోలీవుడ్ లో శింబు - నయనతారల ప్రేమను తీసుకోవచ్చు. సల్మాన్ ఖాన్ తో మనస్పర్ధలు వచ్చిన కొంత కాలం తరువాత అతనితో కలిసి 'ఏక్ థా టైగర్' సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తోంది. ఇక శింబుతో ప్రేమ పెటాకులయ్యాక ప్రభుదేవాని ఆశ్రయించింది నయనతార. ఇటీవల వీరిద్దరి మధ్యా మనస్పర్ధలు రావడంతో, ప్రభు ఏలుబడి లోంచి బైటికొచ్చిన ఆమె, ప్రస్తుతం శింబుతో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా చూస్తుంటే ప్రేమకి విడిపోవడం తెలియదని తెలుసుకుని కలుసుకున్నారేమోనని అనిపించక మానదు!

0 comments:
Post a Comment