Friday

కాలేజీల వివరాలు వెబ్‌సైట్లో ఉంచాల్సిందే


సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) లోని నిబంధనలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) కచ్చితంగా పాటించాలని సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్ ఆదేశించింది. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎంసీఐ తనిఖీ నివేదికలను వెబ్‌సైట్లో పొందుపరచాలని సమాచార కమిషనర్ శైలేశ్ గాంధీ సూచించారు. మెడికల్ కాలేజీల గుర్తింపునకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. గుర్తింపు పొందిన లేదా తిరస్కరణకు గురైన కాలేజీల వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెబ్‌సైట్లో ఉంచాల్సిందేనని సూచించారు.

ఆర్టీఐ చట్టంలోని నాల్గవ నిబంధనను ఎంసీఐ పాటించట్లేదంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో శైలేశ్ ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఒక్కో కాలేజీకి సంబంధించిన నివేదిక కొన్ని వేల పేజీలుంటుందని, ఆసమాచారాన్నంతటినీ వెబ్‌సైట్లో ఉంచడం సాధ్యం కాదని ఎంసీఐ వాదించింది. అయితే ముఖ్యమైన సమాచారాన్ని వెబ్‌సైట్లో పొందుపరచాలని శైలేశ్ గాంధీ సూచించారు. ఈవిధంగా చేస్తే, సమాచారం అందరికీ అందుబాటులో ఉండడంతో ఆర్టీఐ మీద ఒత్తిడి తగ్గుతుందన్నారు.

0 comments:

Post a Comment