నిత్యా మీనన్ తెలియక ప్రవర్తిస్తోందో లేక తెలిసే అలా ప్రవర్తిస్తోందో తెలియదు కానీ, ఆమె ప్రవర్తన మాత్రం ‘టూ మచ్’ గా ఉందనే చెప్పాలి. ఇంతవరకు ఏ హీరోయిన్నూ మాట్లాడని రీతిలో తను లూజ్ గా మాట్లాడుతూ పలువుర్ని హర్ట్ చేస్తోంది. ఆమెకు ఎగస్ట్రాలు కాస్త ఎక్కువే అని ఇంతకు ముందు టాలీవుడ్ లో ఆ నోటా ఈ నోటా విన్నప్పటికీ, నిన్న ’180′ సినిమా ప్రెస్ మీట్లో తెలుగు మీడియా ప్రత్యక్షంగా చూసింది. ‘అవకాశమొస్తే ప్రభాస్ తో నటిస్తారా?’ అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు, ‘ప్రభాస్ ఎవరు?’ అంటూ ఆమె ప్రశ్నించిన తీరుకి సదరు ప్రశ్న అడిగిన జర్నలిస్టే కాకుండా, మొత్తం మీడియానే షాక్ అయింది. నిజంగానే తనకి ప్రభాస్ ఎవరో తెలియదంది. ఆయనేం చేస్తాడని కూడా అడిగిందట.
టాలీవుడ్ కి వచ్చి ఇన్నాళ్ళయినా… ప్రభాస్ ఎవరో ఆమెకు తెలియదంటే, నిత్యా మీనన్ ఏ ‘రేంజ్’ లో తనని తాను ఊహించుకుంటున్నదో మనం ఊహించుకోవచ్చు. నిత్య ఇలా మాట్లాడిన తీరు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ప్రభాస్ తెలియదంది… రేపు మహేష్ బాబు ఎవరనచ్చు… లేక యన్టీఆర్ అంటే ఎవరనచ్చు… అందుకని ఇప్పుడే ఆమెకు గట్టి గుణపాఠం చెప్పాలని టాలీవుడ్ హీరోలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నిత్యాను ఎవరూ తమ సినిమాలలో బుక్ చేయకుండా చేద్దామని అప్పుడే కొంతమంది హీరోలు ప్రపోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వైపుగా పావులు కదుపుతున్నారట.

0 comments:
Post a Comment