Friday

సౌదీ మహిళకు లభించిన ఓటు స్వేచ్ఛ


సౌదీ అరేబియాలో మహిళకు రాజకీయ బంధనాలు తెగిపోయాయి. ఓటుపై ఆంక్షలు తొలగిపోయాయి. పురుష నీడ పూర్తిగా వదిలిపోయింది. ఓటు వేసేందుకే కాదు, పోటీ చేసేందుకు కూడా వారిప్పుడు ఎవరి అనుమతి కోసమూ ఎదురుచూడాల్సిన పని లేదు. మరో నాలుగేళ్లలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలు వారి రాజకీయ రంగ ప్రవేశానికి, ప్రాతినిథ్యానికి వేదిక కల్పించనున్నాయి.

నిజానికి, సౌదీలో చాలా కాలంగానే మహిళలకు ఓటు హక్కు అమల్లో ఉంది. కాకపోతే, దానిపై అనేక రకాల ఆంక్షలు విధించారు. పురుష సంరక్షకుడు ఆమోదిస్తే తప్ప ఆమె ఓటు వేయడానికి గానీ, పోటీ చేయడానికి గానీ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడా మెలికను సౌదీ ప్రభుత్వం తొలగించింది. ఇస్లాం సంరక్షకుడైన సౌదీ రాజు నుంచి తాజా ప్రతిపాదనకు ఆమోదం లభించినట్టు అత్యున్నత మత సంస్థ షురా కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే,ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు మాత్రమే అనుతించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

0 comments:

Post a Comment