Friday

జీఎస్ఎం మొబైల్ ఫోనా.. జాగ్రత్త సుమీ...!


జీఎస్ఎం... ఈ పేరు వినగానే అధునాతన టెక్నాలజీతో తయారైన మొబైల్ ఫోన్లు గుర్తొస్తాయి కదా! మీరు కూడా జీఎస్ఎం (గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్) మొబైల్ ఫోన్‌నే ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త సుమీ! దీనిని సులువుగా హ్యాక్ చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ నెట్‌వర్క్ గల ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది వాడుతున్నారు. అంటే అంతర్జాతీయ మొబుల్ మార్కెట్లో దాదాపు 80 శాతం అన్నమాట. వైర్‌లెస్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ మొబైల్ ఫోన్లపై హ్యాకర్లకు పూర్తి నియంత్రణ ఉంటుంది.

వీటి ద్వారా వారు టెక్ట్స్ మెసెజ్‌లు, కాల్స్ కూడా చేసు కోవచ్చని జర్మనీకి చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్స్ అధ్యక్షుడు కర్‌స్టెన్ నోహి వెల్లడించారు. తక్కువ సమయంలో వందల, వేల ఫోన్లను హ్యాక్ చేయవచ్చని బెర్లిన్‌లో జరిగిన ఓ సమావేశంలో నోహి పేర్కొన్నట్టు డెయిలీ వెల్లడించింది. ఈ దాడులు ఎక్కువగా కార్పొరేట్ పోన్ సిస్టమ్స్‌పై జరుగుతుంటాయి... ఉదాహరణకు వ్యాపారస్తుల ఫోన్ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేసి వారి నెంబర్ నుంచి ఫోన్లు చేసి డబ్బు డ్రా చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే తీరా బిల్లు వచ్చాక గానీ తాము మోసపోయినట్టు ఫోన్ యజమానులకు తెలీదు. అందుకే జీఎస్ఎం ఫోన్ల వినియోగదారులూ.. తస్మాత్ జాగ్రత్త!

0 comments:

Post a Comment