Tuesday

ఒక్క మాత్రతో హ్యాంగోవర్‌కు చెక్

మీరు రాత్రంతా మందు కొట్టారా..? కిక్కు ఎక్కువై తల పట్టేసిందా..? హ్యాంగోవర్ అయిందా..? వాంతులయ్యాయా..? ఇకనుంచి ఈ బాధవసరం లేదు.. ఇవన్నీ ఒక్క మాత్ర తో పటాపంచలై పోతాయి.. ఈ మాత్ర వేసుకున్న 15 నిమిషాల్లోనే మీకు ఉపశమనం కలిగి మళ్లీ హుషారవుతారు..? ఏంటీ ఒక్క మాత్ర తో తగ్గిపోతుందా..? అని అనుకుంటున్నారు కదా..? అవును ఈ మా త్ర ఇప్పటికే ఆన్‌లైన్‌లో లభ్యమవుతోంది.

ఈ మాత్ర పేరు బ్లొఫిష్.. ఈ మాత్రలో 500 మిల్లీగ్రాముల ఆస్ప్రిన్, 60 మిల్లీగ్రామలు కఫెయిన్, అంటాసిడ్ కూడా ఉంటుంది. ఈ మాత్రను శాస్త్రవేత్తలు కనుగొన్నారు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే! దీనిని బ్రెన్నా హేసమ్ కనుగొన్నారు. ఈయన ఇదివరకు ఫైనాన్సియర్‌గా ఉండేవారు.

ఈ మాత్ర పనిచేస్తుందా లేదా అని పరీక్షించడానికి రాత్రిళ్లు తాగిన తర్వాత తెల్లవారి ఈ మాత్ర వేసుకోగానే బాగా పనిచేసిందని హేసమ్ డెయిలీ మెయిల్ పత్రికకు తెలిపారు. 'పరిశోధన ప్రారంభించిన తర్వాత సమ్మేళనాలు కూడా కలపాలనే ఆలోచన వచ్చింది. ఇం దులో మా స్నేహితుల సహాయం కూడా తీసుకున్నాను' అని ఆయన వెల్లడించారు.

ఈ మాత్రకు అమెరికా ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. దీనిని మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హ్యాంగోవర్‌తో బాధపడుతున్నవారు ఈ మాత్రలను రెండు వేసుకుంటే హ్యాంగోవర్ ఇట్టే మటుమాయమవుతుంది. ఇప్పు డే ఇది అమెరికా మార్కెట్లోకి వచ్చింది. ఇది విజయవంతమైతే వచ్చే ఏడాది బ్రిటన్‌లో ప్రవేశపెడతారు. దీని ధర సింగిల్ డోస్‌కు 1.90 పౌండ్లు, ఆరు మాత్రలున్న ప్యాకెట్‌కు 7.60 పౌండ్లు.

0 comments:

Post a Comment