Tuesday

ఒక నిమిషంలో వ్యాయామంతో మధమేహం దూరం...!

మధుమేహమా!? అయ్య బాబోయ్! నాకు రావొద్దని అనుకుంటున్నారా!? ఇది మీ 'కాళ్ల'లోనే ఉందంటున్నారు పరిశోధకులు. వారానికి మూడు రోజులు కేవలం ఒక నిమిషంపాటు సైకిల్ తొక్కితే మధుమేహం రాకుండా నిరోధించవచ్చట. బాత్ యూ నివర్సిటీ పరిశోధకులు కొంతమంది వాలంటీర్లతో ఓ అధ్యయనం చేశారు.

వారానికి మూడుసార్లు ఎక్సర్‌సైజ్ బైక్‌లపై 20 సెకండ్లపాటుసైకిల్ తొక్కమన్నారు. ఆరు వారాల తర్వాత పరిశీలిస్తే.. వారిలో ఇన్సులిన్ పనితీరు 28 శాతం మెరుగు పడిందట. "మన కండరాలే షుగర్ నిల్వలు. వ్యాయామంతో అవి కరుగుతాయి. ఆ తర్వాత రక్తం నుంచి అవి షుగర్ నిల్వలను తీసుకుంటాయి. తద్వారా బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది'' అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నీల్స్ వోలార్డ్ తెలిపారు.

0 comments:

Post a Comment