ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మది నెజాద్‌పై ఓ నిరుద్యోగి బూటు విసిరాడని మెహ్ర్ వార్తా సంస్థను ఉటంకిస్తూ చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. మజందరన్ రాష్ట్రంలోని సరీ నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా నెజాది ప్రసంగిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నదని తెలిపింది.
ఓ చేనేత కర్మాగారంలో పనిచేసే 45 ఏళ్ల వ్యక్తి కొంత కాలం కిందట ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. దీనిపై ఆయనకు మొరపెట్టుకుందామని ఎలాగోలా ముందు వరుసలోకి చేరగలిగాడని తెలిపింది. అయితే, అవకాశం లభించకపోవడంపై ఆగ్రహించి అధ్యక్షుడిపైకి బూటు విసిరినట్లు వివరించింది. అయితే, అది ఆయనకు తగల్లేదని పేర్కొంది.

0 comments:
Post a Comment