భారత్‌కు పక్కలో బల్లెంగా మారేందుకు అందివస్తున్న ఏ అవకాశాన్నీ చైనా జారవిడుచుకోవడం లేదు. తనకు దీటుగా ఆర్థికంగా పటిష్ఠమవుతున్న ఇండియాయే లక్ష్యంగా డ్రాగన్ తన సైనిక వ్యూ హాలను రూపొందించుకుంటోంది. ఇప్పటికే భారత్ సరిహద్దులకు తన సైన్యాన్ని తరలించడానికి వీలుగా లడఖ్ వరకు రోడ్డు మార్గాన్ని నిర్మించిన చైనా.. ఇప్పుడు ఏకం గా హిందూ మహాసముద్రంలో తన సైనిక స్థావరాన్ని ఏ ర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇలా విదేశాల్లో చైనా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలి సారి. ఈ మేరకు.. హిందూ మహాసముద్రంలోని సీషెల్స్ దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చైనా రక్షణ శాఖ సోమవారమిక్కడ ప్రకటించింది. తన నావికాదళానికి అవసరమైన సరుకుల సరఫరా, విశ్రాంతి అవసరాల కోసం దీనిని నెలకొల్పుతున్నట్లు చైనా పేర్కొంది. నిజాని కి.. చైనా ఇప్పటికే హిందూ మహాసముద్రంలో పాగా వేయగలిగింది. హిందూ మహాసముద్రంలో ఉన్న పాలీమెటాలిక్ సల్ఫైడ్ ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు ఐరాస అధీనంలోని అంతర్జాతీయ సీబెడ్ అథారిటీతో ఇ టీవలే ఒప్పందం కుదర్చుకుంది.
దీంతో.. హిందూ మ హాసముద్ర నైరుతీ ప్రాంతంలో 10 వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో ఉన్న సీబెడ్‌లో 15 ఏళ్ల పాటు తవ్వకా లు జరిపే అవకాశం చైనాకు లభించింది. కాగా.. తన తొలి విమాన వాహక నౌకను చైనా త్వరలోనే సైన్యానికి అందజేస్తున్నందున.. ఈ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చే యడం మిలటరీ వ్యూహామని విశ్లేషకులు అంటున్నారు. అయితే.. చైనా రక్షణ శాఖ మాత్రం హిందూ మహా స ముద్రంలో తాము సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం లో విశేషమేమీ లేదంటోంది. దూర ప్రాంతాల్లోని సైనిక ఆపరేషన్లకు నావికాదళాన్ని పంపుతున్నప్పుడు.. మ ధ్యలో ఆగి మళ్లీ సాగడం సాధారణమేనని చెబుతోంది.

0 comments:
Post a Comment