Wednesday

నల్లధనం నిరోధక చట్టం


నల్లధనం కూడబెట్టే చర్యలను నిరోధించే చట్టాన్ని అంతర్జాతీయ చట్టాలకు దీటుగా రూపొందించేందుకు వీలుగా ఒక బిల్లును ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పిఎంఎల్ఏ (సవరణ) బిల్లు-2011గా వ్యవహరించే ఇది చట్టరూపం దాల్చినట్టయితే నల్లధనం కూడబెట్టడాన్ని నేరంగా పరిగణించి ఈ నేరారోపణలపై నమోదయ్యే కేసుల్లో ఆ సొమ్మును లేదా దానితో కొనుగోలు చేసిన ఆస్తులను విచారణ సమయంలోనే స్వాధీనం చేసుకునే అధికారం లభిస్తుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌లో ఇండియా కూడా భాగస్వామిగా ఉన్నందువల్ల ఈ సవరణ అవసరం అయిందని ప్రభుత్వం తెలిపింది. 2002లో రూపొందించిన ఈ చట్టాన్ని 2005, 2009 సంవత్సరాల్లో సవరించారు

0 comments:

Post a Comment