.వార్తా కథనాన్ని ప్రచురించిన బ్రిటీష్ పత్రిక
.ఖండించిన నిపుణులు
.అనవసర భయాందోళనలని కొట్టివేత
Tumble-down Taj: India's most famous building could collapse within five years, say experts
ఆగ్రా : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన, అజరామర ప్రేమ మందిరం తాజ్ మహల్ మరో ఐదేళ్ళలో కుప్పకూలి పోనుందా? ఇప్పుడు ఆగ్రాలో ప్రతి ఒక్కరి నోటా నానుతున్న ప్రశ్న, సందేహం ఇదే. ఈ మేరకు బ్రిటీష్ వార్తాపత్రిక ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. తన కథనానికి మద్ద తుగా ఆ పత్రిక ఒక పార్లమెంట్ సభ్యుని, చరిత్రకారుడిని ఉటంకిం చింది. అయితే, యమునా నది ఎండిపోతుండడంతో ఇటువంటి భయాందోళనలు వ్యక్తమవు తున్న ప్పటికీ ఈ కథనం తప్పుడు భయా లను, ఆందోళనలు సృష్టిస్తున్నదని వారు పేర్కొన్నారు. డైలీ మెయిల్‌లో ఈ వారం ప్రారంభంలో జేమ్స్ థాపర్ ఇచ్చిన వార్తలో స్థానిక బిజెపి ఎంపి రామ్ శంకర్ ఖటారియాను ఉటంకించారు. 17వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడం పునాదులు దెబ్బతిన్నాయని, గోడల్లో ఉపయో గించిన చెక్క పాడైందని ఆయన పేర్కొన్నారు. తాజ్‌మహల్ ఐదేళ్ళలో కూలిపోవచ్చని ఖటారియా అన్నట్లు ఆ పత్రిక ఉటంకించింది. అలాగే ప్రముఖ మొఘల్ చరిత్రకారుడు ఆర్.నాథ్ వ్యాఖ్యలను కూడా ఆ పత్రిక ఉదహరించింది. ఈ నేప థ్యంలో భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) అధికారులు తాజ్ మహల్ కట్టడాన్ని, ఆ కట్టడం వెనుక భాగా న్ని, యమునా నదిని మరోసారి పరిశీలించారు. ''ఎక్కడా ఎలాంటి పగుళ్ళు కానీ, బీటలు కానీ కని పించలేదు'' అని ఎఎస్‌ఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. యమునానదిలో నీరు లేనందున, అది క్రమంగా ఎండిపోతున్నందున మాత్రమే తాను ఆ రకంగా భయాందోళనలు వ్యక్తం చేసినట్లు చెప్పారు. కట్టడం సక్రమంగా వుండాలంటే యమునానదిలో తగిన నీరు వుండడం ఎంతైనా అవస రమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకానీ తాజ్ మహల్ కూలి పోవడానికి తానేమీ డెడ్‌లైన్ పెట్టలే దని, పైగా తనను ఫోన్‌లో కొంత మంది వ్యక్తులు అభిప్రాయాలు అడిగితే చెప్పానని, అంతేకానీ వారు విదేశీ మీడియా అని కూడా తనకు తెలియదని ఖటారియా చెప్పారు. తాజ్‌మహల్ వెనుక భాగాన పూర్తి స్థాయిలో పారుతున్న యమునా నది వుండడం ఎంతైనా అవశ్యమని చరిత్రకారుడు నాథ్ అనేక సంద ర్భాల్లో పేర్కొన్నారు, మొఘల్ కట్ట డాలు, నిర్మాణాలపై రాసిన అనేక పుస్తకాల్లో రాశారు. అయితే ఆయన కూడా ఏనాడూ నిర్దిష్ట కాలవ్యవధిలో ఈ కట్టడం కూలిపోతుందని చెప్ప లేదు. 'అర్ధరహితమైన, అనవస రమైన ఆందోళనలను సృష్టించారు. తాజ్ మహల్ బరువును తట్టుకో వాలంటే అందుకు ప్రతిగా సమాంత రంగా యమునా నదిలో నీరు వుండ డం ఎంతైనా ముఖ్యం. పునాదిలో వాడిన చెక్క నీటిలోనే వుండాలా, అక్కర్లేదా అనేదానిపై నేనేమీ వ్యాఖ్యా నించలేను. దానిపై పరిశీలన జరపా ల్సింది నిపుణులు, సివిల్ ఇంజనీర్లని నాథ్ పేర్కొన్నారు. ఎండిపోతున్న నది తాజ్ మహల్‌కు ముప్పు తీసుకు రావచ్చని అనేకమంది చరిత్ర కారులు, వాస్తు ఇంజనీర్లు భయపడు తున్నారు. గోడలు, ఆర్చీల్లోని సంక్లి ష్టమైన నిర్మాణం, బ్రహ్మాండమైన పునాది చెక్కుచెదరకుండా అలాగే కొనసాగాలంటే నదిలో నీరు వుండ డం ఎంతైనా ముఖ్యమే. నీరు లేక ఎండిపోతే చెక్క బీటలు వారి, ముక్కముక్కలు కావడానికి అవకాశ ముందని రిటైరైన ఎఎస్‌ఐ అధికారి అన్నారు. 1987లో యునె స్కోకి చెందిన నిపుణుల కమిటీ ఇక్కడ పర్యటించి పునాదుల గురించి, ఇక్కడ నేల, అలాగే అందులో వాడిన ఇతర పదార్ధాల స్వభావాల గురించి చాలా తక్కువ సమాచారం లభ్యమ వడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ సాంస్కృతిక వార సత్వ సంపద ఘనతను సము పార్జించుకున్న, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఇంతటి మహత్తర నిర్మా ణానికి సంబంధించిన సమాచారం సంపూ ర్ణంగా అందుబాటులో వుండాలి, అప్పుడే పారిశ్రామిక నీటి కాలుష్యం, భూకంప ప్రభావాలు వంటి ముప్పులేమైనా వున్నాయా అనే విషయాలను పరిశీలించడానికి వీలుంటుందని ఆ కమిటీ తన నివేది కలో పేర్కొంది.
0 comments:
Post a Comment