Thursday

భారతీయులంటే ఇష్టం... దేశమంటేనే ద్వేషం!

న్యూయార్క్: భారతదేశమంటే పీకలదాకా ద్వేషమున్నా.. ఇక్క డి ఆహారమన్నా.. ప్రజలన్నా తనకెంతో ఇష్టమని లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పాడు. ఓ దేశంగా భారత్ అంటే తనకు ద్వేషమని తెలిపాడు. ‘భారత ఆహారం అంటే ఇష్టం.. భారత ప్రజలంటే ఇష్టం.. కానీ భారత్ అంటే నాకిష్టం లేదు’ అని గతేడాది అమెరికాలోని షికాగోలో విచారణ సందర్భంగా భారత్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం అధికారితో హెడ్లీ అన్నాడు.

26/11 ముంబై మారణహోమానికి ముందు ఉగ్రవాదులు దాడులు చేసే ప్రాంతాల వద్ద హెడ్లీ రెక్కీ నిర్వహించిన సంగతి తెలిసిందే. భారత అధికారులు తనను విచారిస్తున్న సందర్భంలో ఆయన పలు విషయాలను తెలిపినట్లు ‘ప్రొపబ్లికా’ న్యూస్‌కు చెందిన పరిశోధనా జర్నలిస్ట్ సెబాస్టియన్ రోటెల్లా చెప్పారు. ఉగ్రవాద నిరోధక దళం అధికారి చెప్పిన వివరాలను ఉటంకిస్తూ.. సెబాస్టియన్ ఓ కథనాన్ని రాశారు. దీని ప్రకారం.. లాహోర్‌లోని నివాసంలో ముంబై దాడుల కవరేజీని హెడ్లీ తన భార్య ఫైజాతో కలిసి టీవీలో వీక్షించాడు. ముంబై దాడులు జరగగానే టీవీ ఆన్ చేసి చూడమంటూ.. ఈ దాడుల సూత్రధారుల్లో ఒకడైన సాజిద్ మీర్ నుంచి హెడ్లీకి ఎస్‌ఎంఎస్ వచ్చింది. 2008 నవంబరు 28న అంటే దాడులు జరిగిన రెండ్రోజులకు హెడ్లీ పాకిస్తానీ భార్య షాజియా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈమెయిల్ పంపింది. దాడుల ఘటన హెడ్లీకి డిగ్రీ ప్రదానోత్సవంలాంటిదని.. ఈ సినిమాను(ముంబై దాడులు)రోజంతా చూశాన ని చెప్పింది. తమతో మాట్లాడేటప్పుడు షాజియా గురించి ప్రశ్నలడగరాదని హెడ్లీ షరతు పెట్టినట్లు భారత్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం అధికారి చెప్పారని సెబాస్టియన్ ఆ కథనంలో పేర్కొన్నారు. ‘ఆమె నాకు నలుగురు పిల్లలను ఇచ్చింది. వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకుని, ఆమెను మోసం చేసినప్పటికీ.. షాజియా నాపట్ల విధేయురాలిగా ఉంది. నేను ఆమెను ఆరాధిస్తాను’ అని హెడ్లీ అన్నాడు.

0 comments:

Post a Comment