Thursday

చైనా పుతిన్!

రష్యా ప్రధాని పుతిన్ రూపురేఖలు ఉన్న చైనా నిరుపేద రైతు లోయాన్‌పిన్ ఇప్పుడు రాత్రికిరాత్రి పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు
బీజింగ్: రష్యాకు ఓ పుతిన్ ఉన్నట్లే.. ఇప్పుడు చైనాకూ ఓ పుతిన్ తయారయ్యాడు. రష్యా ప్రధాని పుతిన్ రూపురేఖలు ఉన్న చైనా నిరుపేద రైతు లోయాన్‌పిన్(48) ఇప్పుడు రాత్రికిరాత్రి పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. చైనాలోని అన్‌హుయ్ ప్రావిన్స్‌లో ఉంటున్న లోయాన్‌పిన్‌ను చూసిన. ఓ జర్నలిస్టు.. అతడిలో పుతిన్ పోలికలు ఉన్న విషయాన్ని గుర్తించాడు. అంతే.. వెనువెంటనే లోయాన్‌పిన్ ఫొటోలు ఆన్‌లైన్ న్యూస్ సైట్లలో ప్రచురితమైపోయాయి. ఇప్పటికే గ్రామంలోని అతడి సహచర రైతులు లోయాన్‌పిన్‌ను ‘బ్రదర్ పుతిన్’ అని పిలిచేసుకుంటున్నారు. అవివాహితుడైన లోయాన్‌పిన్ తనకు లభిస్తున్న ప్రచారాన్ని చూసి ఉబ్బితబ్బిబైపోతున్నాడు. ఇది తన జీవితాన్ని మారుస్తుందనే ఆశాభావంతో ఉన్నాడు. అంతేకాదు.. తనకో పెళ్లాన్నీ తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాడు. ఇక వ్యవసాయానికి గుడ్‌బై చెప్పేసి.. కార్పొరేట్ ఫంక్షన్లలో నకిలీ పుతిన్‌లాగా కామెడీ షోలు ఇవ్వాలని యోచిస్తున్నాడు. రష్యా, చైనాల మధ్య సన్నిహిత రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. పుతిన్‌కు చైనాలో మంచి క్రేజ్ ఉంది.

0 comments:

Post a Comment