Wednesday

దేశంలోనే తొలి ఇంటర్నెటట్ పంచాయతీ జనుపల్లి


దేశంలోనే తొలిసారిగా పల్లెటూళ్లను ప్రపంచానికి అనుసంధానం చేసే ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్-హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ పథకం భారతీయ పంచాయితీ లింక్స్‌ను తూర్పుగోదావరి జిల్లా జనుపల్లి గ్రామపంచాయితీలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ప్రారంభించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలన్నింటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయనున్నారు. తొలుత ఈ పథకాన్ని రాజస్థాన్‌లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావించినప్పటికీ ఆ రికార్డును అమలాపురం మండలంలోని జనుపల్లి చేజిక్కించుకుంది. మంగళవారం నాడిక్కడ జరిగిన కార్యక్రమంలో టెలికాం జనరల్ మేనేజర్ జి రాఘవేంద్రరావు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ పథకం భారతీయ పంచాయితీ లింక్స్ ఇంటర్నెట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ హైవే సెంటర్ల ఏర్పాటుకు తొలి విడతగా ఆరు లక్షల గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

అమలాపురం రూరల్ మండలంలోని 11 గ్రామాలతో పాటు కోయంబత్తూరు, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లలో తొలి విడతగా ఈ సెంటర్లను ప్రారంభించనున్నారు. మలివిడతలో ఈ పథకాన్ని ఒకేసారి దేశంలోని అన్ని గ్రామాలకు విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ అమలు కోసం మున్ముందు ఎలాంటి నిధుల సమస్య లేదని కూడా తేల్చేసింది. ఇంటర్నెట్ సదుపాయాన్ని గ్రామ పంచాయతీలకే పరిమితం చేయకుండా ప్రతి ఇంటికీ విస్తరిస్తారు. కంప్యూటర్ ఉంటే చాలు కోరిన వెంటనే ఇంటర్నెట్‌కు అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం ఉన్న వేగం కంటే వెయ్యి రెట్ల వేగం ఈ ఇంటర్నెట్ ప్రత్యేకత.

0 comments:

Post a Comment