సోష ల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ విషయంలో ఇటీవలి కాలంలో అ నేక అనుమానాలు, ప్రచారాలు వస్తున్నాయి. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూ డా తన కూతుళ్లను ఇక మీదట దాని జోలికి వెళ్లొద్దని చెప్పారట!! 2008 అధ్యక్ష ఎన్నికల్లో జనంలోకి వెళ్లడానికి సోషల్ మీడియాను ప్రధానాయుధంగా ఉపయోగించుకున్న ఒబామాయే.. ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారు. తన కు టుంబానికి చెందిన వ్యక్తిగత విషయాలను జనానికి అంతగా తెలియజేయడం ఇష్టం లేకనే ఆయన ఇలా చెప్పి ఉంటారని భావిస్తున్నారు.
ఒబామా పెద్దకుమార్తె మాలియా (13)కు ఫేస్‌బుక్ వాడేందుకు వయసుకూడా సరిపోతుంది. ఆమె చెల్లెలు సాషాకు మాత్రం ఇంకా పదేళ్లే. ఎన్నికల ప్రచార సమయంలో ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ను విస్తృతంగా వాడుకోవడంతో ఆయనను 'తొలి సోషల్ మీడియా అద్యక్షుడి'గా అంతా పిలుచుకున్నారు. ఆయన ఫేస్‌బుక్ పేజీకి 2.4 కోట్ల 'లైక్'లు రావడంతో మరోసారి కూడా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.
0 comments:
Post a Comment