Saturday

భారత్‌లో అమెరికా రాయబారిగా నాన్సీ...


భారత్‌లో అమెరికా రాయబారి పదవిని తొలిసారిగా ఓ మహిళ చేపట్టనున్నారు. ఈ పదవికి 64 ఏళ్ల నాన్సీ జే పావెల్‌ను అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎం పిక చేశారు. దక్షిణాసియా వ్యవహారాల్లో ఆమెకు గట్టి పట్టు ఉంది. గతంలో వివిధ దౌత్య హోదాల్లో పని చేశారు. హిందీ, ఉర్దూ, ఫ్రెంచ్, నేపాలీ భాషలను నేర్చుకోవడం విశేషం. రెండేళ్ల పాటు అమెరికా రాయబారిగా కొనసాగిన తిమోతి జే రోమెర్ ఏప్రిల్‌లో ఆ పదవికి రాజీనామా చేశారు. 
కొత్త రాయబారి నియామకాన్ని సెనేట్ ఆమోదించిన వెంటనే.. రోమెర్ స్థానాన్ని పావెల్ భర్తీ చేస్తారు. రాయబారిగా తాత్కాలిక బాధ్యతలను పీటర్ బర్లీగ్ నిర్వర్తిస్తున్నారు. విదేశీ వ్యవహా రాల్లో పావెల్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఉత్తర ఐయోవా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పావెల్.. ఓ స్కూ ల్‌లో సోషల్ టీచర్‌గా ఆరేళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం ఆమె విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్‌గా, విదేశాంగ శాఖలో మానవ వనరుల శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

0 comments:

Post a Comment