Saturday

బాలీవుడ్ బాటలో మరో సౌత్ హీరో


మన హీరోయిన్లకే కాకుండా హీరోలకు కూడా బాలీవుడ్ పిచ్చి బాగానే పట్టుకుంది. అందుకే, ప్రతి హీరో కూడా హిందీ సినిమాల వైపు చూస్తున్నాడు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న 'ఆవారా' ఫేం, తమిళ హీరో కార్తీ కూడా బాలీవుడ్ సినిమా చేయాలని గత కొంత కాలం నుంచీ ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతనికి ఓ బాలీవుడ్ దర్శకుని నుంచి ఆఫర్ వచ్చిందట. దాంతో మనవాడు ఆ ఆఫర్ని వెంటనే ఒప్పేసుకున్నాడనీ, డేట్స్ కూడా అడ్జెస్ట్ చేస్తున్నాడనీ కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మిగతా హీరోలలా ఏదో వెళ్లి... ఓ సినిమా చేసొచ్చేయడం కాకుండా, అక్కడ రెగ్యులర్ గా సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇంతవరకు సౌత్ హీరోలు అడపా దడపా ఏవో సినిమాలు చేశారు గానీ, అక్కడ పూర్తిగా సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం లేరు. మరి, కార్తీ అవుతాడేమో చూద్దాం! 

0 comments:

Post a Comment