Friday

అవన్నీ వదంతులంటున్న తమన్నా


 తనకు తమిళ సినిమాల్లో అవకాశాలు రావడం లేదనీ, అందుకే త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఓ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నాననీ ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను మిల్కీ వైట్ భామ తమన్నా ఖండిస్తోంది. తాను ఏ సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా కమిట్ అవ్వలేదని ఆమె మీడియాకు వివరించింది. తనకు తమిళ సినిమాలలో అవకాశాలు రావడం లేదంటూ ఎవరో కావాలనే తనపై వదంతులు పుట్టిస్తున్నారని ఆమె ఆరోపించింది.
      తనకు ప్రతి రోజూ కోలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయనీ, కానీ పర్శనల్ కారణాల వల్ల కోలీవుడ్ ఆఫర్స్ అంగీకరించడం లేదని తమన్నా చెప్పింది. అయితే, ఆ వ్యక్తిగత కారణం ఏమిటన్నది మీడియాతో పంచుకోనని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నానని చెప్పింది. తెలుగులో కూడా ఇంకా కొత్త సినిమాలు ఏవీ కమిట్ కాలేదని తెలిపింది తమన్నా. ఇంతకీ, తమిళంలో చేయకపోవడానికి కారణం ఏమిటన్నదే అందరికీ అంతుబట్టని విషయంగా వుంది!

0 comments:

Post a Comment