Friday

మార్కెట్లో పవన్ కల్యాణ్, శృతి హాసన్...!


పవన్ కల్యాణ్ తాజా చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షూటింగు కోసం అక్కడ పెద్ద మార్కెట్ సెట్ వేశారు. ప్రస్తుతం ఆ సెట్లో హీరో పవన్ కల్యాణ్, హీరోయిన్ శృతి హాసన్ లపై మార్కెట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల ౨౬ వరకు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తామని చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అక్రమార్కుల ఆటకట్టించడానికి అవసరమైతే నియమ నిబంధనలను అతిక్రమించవచ్చనే అభిప్రాయంతో ముందుకు సాగే పోలీస్ ఆఫీసర్ గా ఈ పాత్రను దీనిని తీర్చిదిద్దారు. హిందీలో సూపర్ హిట్టయిన దబాంగ్ చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

0 comments:

Post a Comment