Saturday

అబూ సలేంకు ఊరట టాడా కేసులపై సుప్రీం స్టే


గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. రెండు కేసుల్లో అతనిపై జరుగుతున్న టాడా విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. అయి తే మిగిలిన ఐదు కేసుల విషయంలో స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తనపై నమోదు చేసిన అన్ని క్రిమినల్ కేసులను కొట్టివే యాలన్న సలేం అభ్యర్థనపై నాలుగు వారాల్లోగా స్పందించాలంటూ సీబీఐకి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 

సలేంపై నమోదైన రెండు టాడా కేసుల్లో.. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసు కూడా ఒకటి. సలేం అప్పగింత సమయంలో.. ఉరిశిక్ష లేదా 25 ఏళ్లకు మించి కారాగారశిక్ష విధించరాదంటూ పోర్చుగల్ ప్రభుత్వం షరతు విధించింది. అందుకు భిన్నంగా.. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న సలేంపై అభియోగాలు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో భారత్ దేశబహిష్కార నిబంధనలకు ఉల్లంఘించిందని పోర్చుగల్ సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ఆ అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ మేరకు టాడా విచారణను ముగించాలంటూ సలేం సుప్రీంను ఆశ్రయించాడు. దీంతో పోర్చుగల్ సుప్రీం తీర్పును గౌరవించాల్సి ఉందని సుప్రీం బెంచ్ పేర్కొంది.

0 comments:

Post a Comment