Monday

రాత్రి ఆకాశ అందాలకు నగర దీపాల కాలుష్య గ్రహణం...


నగర, పట్టణ ప్రాంతాల విస్తరణ.. అంతరిక్ష పరిశోధకులు, ఔత్సాహికులకు పెద్ద బెడదగా మారింది. ఈ నగర దీపాల కాలుష్యం.. రాత్రి పూట మాత్రమే గోచరమయ్యే పాలపుంత, ఇతర గెలాక్సీల వెలుగులను మింగేస్తోంది. చిమ్మచీకటిగా ఉన్న రాత్రి పరిస్థితిల్లోనే అతి తక్కువ వెలుగుతో కనిపించే, మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, తారల ఉనికిని పట్టుకోవడం సాధ్యమవుతుంది. 

ఈ కారణంగానే రాత్రి ఆకాశం వెలుగుల స్థాయిని కొలిచే కార్యక్రమాన్ని ఎన్జీవో స్పేస్, గ్లోబ్ ఎట్ నైట్ అనే అంతర్జాతీయ సంస్థలు 'ది గ్రేట్ ఇండియన్ స్టార్ కౌంట్' పేరిట ఆదివారం ఇక్కడ ప్రారంభించారు. ఈ కార్యక్రమం నాలుగు విడతలుగా ఏప్రిల్ 20వ తేదీ వరకు సాగుతుంది. ఉద్యమంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే ఔత్సాహికులు రాత్రి పూట ఆకాశాన్ని ఆవరించే కుత్రిమ వెలుగుల తీవ్రతను, అంతరిక్ష మిత్రులపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేసి, సహజ వెలుగుల ఆకాశం ఆవశ్యకతపై ప్రజలను చైతన్య పరుస్తారు.

0 comments:

Post a Comment