Tuesday

శబ్ద తరంగాలతో 'నిర్వీర్యం'...?


కండోమ్‌తో సెక్స్‌లో పాల్గొనాలంటే.. అసౌకర్యం. వేసెక్టమీ చేయించుకోవడానికి భయం. ఈ రెండు ఇబ్బందులతో బాధపడే పురుషపుంగవులకు శుభవార్త! శబ్దతరంగాలతో వీర్యకణాల సంఖ్యను గణనీయంగా తగ్గించే కొత్త టెక్నాలజీని కనుగొన్నామని నార్త్ కరొలినా యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఈమేరకు ఎలుకలపై తాము చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయని తెలిపారు. పదిహేను నిమిషాల వ్యవధితో, రెండుసార్లు రెండు డోసుల ట్రీట్‌మెంట్‌తో ఎలుకల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా... మిల్లీలీటర్‌లో 10 మిలియన్ల స్థాయికి తగ్గిపోయిందని, మనుషుల్లో ఈ సంఖ్య 15 మిలియన్లకు తగ్గితే వారికి పిల్లలు పుట్టే అవకాశాలుండవని వివరించారు. 



అయితే, మనుషుల్లో ఈ పద్ధతి పనిచేసేదీ లేనిదీ.. ఒకవేళ పనిచేసినా ఎంతకాలం దాని ప్రభావం ఉంటుంది? కొంతకాలం తర్వాత వీర్యకణాల సంఖ్య పెరిగితే మళ్లీమళ్లీ ఈ ట్రీట్‌మెంట్ ఇవ్వొచ్చా? తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు పూర్తిస్థాయిలో ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందన్నారు. "అల్ట్రాసౌండ్ పద్ధతిలో పురుషుల్లో శాశ్వత కుటుంబ నియంత్రణ'' అనే అంశంపై 1970ల నుంచే చర్చలు జరుగుతున్నాయి.

0 comments:

Post a Comment