Saturday

ఐక్యరాజ్యసమితి పార్శిళ్లలో 16 కిలోల కొకైన్ పట్టివేత


ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి ఇటీవల చేరిన పార్శిల్ సంచుల్లో16 కిలోల విలువైన కొకైన్‌ను కనుగొన్నారు. దీని విలువ 20లక్షల అమెరికన్ డాలర్ల విలువ ఉంటుందని అంచనా. కొకైన్ సంచులున్న రెండు పార్శిల్ బస్తాలను సమితి ప్రధాన కార్యాలయంలోని తపాలా కేంద్రం వద్ద ఈ నెల 16న పోలీసులు కనుగొన్నట్టు సమితి అధికార ప్రతినిధి మార్టిన్ నెసిర్కీ తెలిపారు. మెక్సికో నుంచి వచ్చినట్టు ఆధారాలున్నా.. పంపినవారి చిరునామా లేదు. ఈ సంచులు సమితి కోసం లేదా ఇక్కడి వారి కోసం కానీ ఉద్దేశించినవి కావని, అవి దౌత్య కార్యాలయాల సంచుల్లో బట్వాడా కాలేదని నెసిర్కీ వివరించారు. మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే వ్యక్తులే ఈ అక్రమానికి ఒడిగట్టారని మరో అధికారి పేర్కొన్నారు.

0 comments:

Post a Comment