Monday

కామర్సు విద్యార్దులుకు అన్యాయం జరుగుతున్న పట్టించుకొని ప్రభుత్వం మరియు మేధావులు


బ్యాంకు ఉద్యోగాలకు బి.కాం విద్యార్ధులును మాత్రమే అర్హులు గా ప్రకటించాలి
బి.ఎస్సీ (గణితం) బి.ఈడి చేసి గణితం చెప్పొచ్చు, బి.ఎస్సీ (సైన్సు) బి.ఈడి చేసి సైన్సు చెప్పొచ్చు, బి.ఎ బి.ఈడి చేసి సోషల్ చెప్పొచ్చు, కానీ బి.కాం బి.ఈడి వాళ్ళు సోషల్ చెప్పాటానికి అనర్హులు గా ప్రకటించడం ఏమిటి ఈ అన్యాయం. గణితం చదివినవాడు ఇంజనీర్, సైన్సు చదివిన వాడు డాక్టర్ లేక శాస్త్రవేత్త అయనప్పుడు కామర్సు చదివినవాడు కనీసం బ్యాంకు లో క్లర్క్ కూడా అవ్వకుండా చేస్తున్నారు మన ప్రభుత్వం మరియు మేధావులు.బికాం వాళ్ళకి ప్రత్యేక విభాగం అంటూ లేక పోవడం ఈ మేదవులు చేసిన పెద్ద మరియు క్షమించరాని తప్పుగా నేను బావిస్తున్నాను.ఇంజనీర్ కి విద్యార్హత గణితం అయనప్పుడు బ్యాంకు ఉద్యోగాలకు మాత్రం ఎవరు అయన అర్హులే( బి కాం వాళ్ళు మాత్రం అర్హులు కానీ అనర్హులుగా మిగిలి పోయారు). బ్యాంకు పరీక్షలో ఒక్క కామర్సు బిట్ కూడా లేక పోవడం చాల బాధాకరం. బ్యాంకు పరీక్ష లో గణితం ఏమిటి అసలు, బ్యాంకులలో ఉపయోగించే కామర్సు కి బదులు రీజనింగ్, అర్థమెటిక్ ప్రవేశ పరీక్షలో పెట్టడం చాల విచారకరం, అటువంటప్పుడు కామర్సు కోర్సును పెట్టి విద్యార్దులు ని మోసం చేయడం ఎందుకు. బి కాం విద్యార్దులు డి.ఎస్సి అర్హులు కానప్పుడు బి ఎస్సీ , బి ఎ విద్యార్దులు బ్యాంకు ఉద్యోగాలకు ఎవిదంగా అర్హులో ఈ ప్రభుత్వమే సమాదానం చెప్పాలి. మతి స్తిమితం లేనివాడు బ్యాంకు ఉద్యోగాలకు అర్హత మరియు సిలబస్ నిర్ణయించినట్లు వుంది. మతి స్తిమితం లేని మేధావులు చేతిలో బికాం విద్యార్దులు జీవితాలు నాశనం అయ్యాయి

0 comments:

Post a Comment