Thursday

బాల్య వివాహాలను అడ్డుకుంటున్న బెంగాల్ బాలికలకు రాష్ట్రపతి అవార్డు

పశ్చిమ బెంగాల్ పురులియా జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టిన ముగ్గురు అమ్మాయిలు సంగీత బౌరి, బినా కాలింది, ముక్తి మజ్హి బాల్య వివాహాలను అడ్డుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ వీరికి సాహస బాలికల అ వార్డును అందజేశారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలను నిరోధించడానికి బాలికలు చేస్తున్న కృషి గురించి రాష్ట్రపతి పాటిల్ అడిగి తెలుసుకున్నారు.

బాల్యవిహాలపై చైతన్యం తీసుకువస్తున్న ఈ బాలికలు తోటి అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని వారిని అభినందించా రు. ఈ అమ్మాయిల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలని పురులియా జిల్లా అధికారులకు రాష్ట్రపతి సూచించారు. ఈ ముగ్గురు అమ్మాయిలు మరో ఇద్దరు బాలికలు అప్సనా ఖాటన్, సునీతా మహతోతో కలిసి బాల్య వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. చిన్నతనంలో పదిమంది మెచ్చుకునే పనులు చేస్తే ఎలాంటి గౌరవం దక్కుతుందో నిరూపించిన ఈ బాలికలు తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

0 comments:

Post a Comment