Friday

పూజకు సమయాసమయాలు

పానీయంబులు ద్రావుచుం గడుచుచున్‌ భాషించుచున్‌ హాసలీ
  లా నిద్రాదులు సేయుచుందిరుగుచున్‌ లక్షించుచున్‌ సంతత!
  శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాదసం
ధానుండై మఱచెన్‌ సురారి సతు డేతద్విశ్వమున్‌ భూవరా!!

భాగవతంలో ప్రహ్లాద చరిత్రలోనిది ఈ పద్యం. ఏదైనా తాగుతున్నా, తింటున్నా, ఎవరితోనైనా మాట్లా డుతున్నా, ఇటు అటు తిరుగుతున్నా చివరకు నిద్ర పోతున్నా సరే ప్రహ్లాదుడు శ్రీహరి ధ్యానం మానలేదని ఈ పద్యానికి తాత్పర్యం. దీనిప్రకారం భక్తుడు సర్వాకాల సర్వావస్థలలోను భగవంతుడిని ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉండాలి. ధ్యానం లాగా పూజ కూడా మానసికమైన ప్రక్రియే. చాలామంది పూలు విసిరి, దీపం తిప్పడం పూజ అనుకుంటారు. ఇది పూజ కాదు. మానసికంగా భావనను అభ్యాసం చేయడానికి తోడ్పడే ప్రక్రియ మాత్రమే. పూజ ప్రధానంగా రెండు రకాలు.

ఒకటి మానసికపూజ, రెండు బహిరంగ పూజ. నిజానికి మాన సిక పూజే అసలు పూజ. ఎదురుగా విగ్రహంతో నిమి త్తం లేకుండా మనసులో దేవతామూర్తిని సజీవంగా భావించుకొని ఆయన కాళ్లు కడుతున్నట్లు, స్నానం చేయి స్తున్నట్లు, భోజనం తినిపిస్తున్నట్లు భావించుకుంటూ వెళ్లటమే మానసిక పూజ. ఇది సగుణ ధ్యానానికి మరో రూపం. ఇంత కల్పన చేయడానికి, దానికి కావలసిన వివరాలన్నీ అణువణువుగా మనసులో భావించుకోవ డానికి తీవ్రమైన మనోబలం ఉండాలి. ఇది కొంత లోపిం చినపుడు దీనికి సహాయపడేందుకు బహిరంగ విగ్రహ పూజను ఏర్పరిచారు. ఇందులో ఇష్టదైవం మన ఎదురు గానే ఉంటుంది. దాన్ని చూస్తూనే పూజను చేస్తాం. ఎవరైతే మానసిక పూజ స్థాయిలో ఉన్నారో వారికి సమయాసమయాలు లేవు.

ఇది నిరంతరం సాగవలసిన ప్రక్రియ. బహిరంగ పూజదశలో ఉన్నవారు పూజకు సమయాసమయాలు పాటించాల్సి అవసరం ఉంది. మహాక్షేత్రాలలో కూడా ఆ క్షేత్ర సంప్రదాయాలను బట్టి పూజా సమయాలలో మార్పులు ఉంటాయి. సామా న్యులు పూజ చేసుకోదలిచినపుడు పగలు భోజనం కాక ముందే పూజ చేసుకోవడం విధిగా పెట్టుకోవాలి. రాత్రి సమయంలో పూజచేసేటప్పుడు మగవారు తలస్నానం చేయాలి. ఆడవారు పసుపునీరు నెత్తిన చల్లుకుంటే సరిపోతుంది.

0 comments:

Post a Comment