Friday

స్వధర్మాచరణమే కర్మమార్గం

తాను చేయాల్సిన పనిని చక్కగా నిర్వహించడం కర్మ. దీన్నే స్వధర్మాచరణం అంటార. ఈ పనికి దగ్గరగా ఉండే ఇతర విషయాలను బాగా చేయాలి. వీటిని ఆదర్శవంతంగా, పవిత్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలి. ఈ సందర్భంలో అహం కారం లేకుండా కార్యం, కర్మమయం కావాలి. ప్రతి వ్యక్తి జీవితానికి స్వధర్మాచరణం ముఖ్యం. దీని మీద వ్యక్తి జీవిత సేధ నిర్మాణం మనుగడ ఆధారపడి ఉంటాయి. జ్ఞానాన్ని పంచి, సమా జాన్ని వృద్ధి చేయడం అనే కర్మమార్గం గురు ధర్మం. ఈ సాధనతో తన విద్యార్థుల భవిష్య త్తును సూచిస్తాడు. రోగిని రక్షించడం వైద్యుని కర్తవ్యం మంచిగా సరైన చికిత్సను అందిస్తా డాయన.

రైలింజను నడిపే డ్రైవరు ముందుచూపుతో తన వెనుక బోగీల్లో ఉన్న ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తాడు. కర్మలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనదేశానికి కర్మభూమి అనే పేరొచ్చింది. వేద నాగరికతలో కర్మ మార్గం ముక్తి సాధనంగా చెప్పబడింది.
''కర్మేస్త్రియైః కర్మయోగః కర్మేంద్రియాలతో కర్త వ్యం నిర్వహించు మనిషి కర్మయోగి. ''కర్మయోగే నయోగినామ్‌ కర్మనిష్ఠ కల్గిన వారు యోగులు. ''నియంతంకురు కర్మత్త్వమ్‌ నీవ్ఞ నియమం ప్రకారం కర్మను చేయాలి. ఈ వాక్యాల్లో కర్మ గొప్పతనం వివరించబడింది. వేదంలో నిర్దేశించిన కర్మలు, ఆచార వ్యవహారాలు, వ్రతాలు, నియమ నిష్ఠలు, వర్ణాశ్రమ ధర్మాలు, నోములు, పండు గలు, వివాహం ఆ భారతీయుల కర్మలకు ప్రతి బింబాలు.

గ్రామీణ ప్రజల్లో కర్మలయందు ఆసక్తి కని పిస్తుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయని వాళ్ల విశ్వాసం. దాసీ జనం, సేవకులు, కుమారులు, స్నేహితులు, బంధువర్గం, వాహనాలు, ధనం, ధాన్యం అనేవి ఎనిమిది రకాల సంపదలు కర్మ సంపదలని జానపదుల నమ్మకం. ఇంకా తోటి వారికి డబ్బు ఇచ్చేట్లు  పనులను అప్ప చెప్పడం, తోటి వారి ధనధాన్యాలను చూసి సంతోష పడడం, తోటి వాళ్లు చేసే కర్మల్లో తమ వంతు సాయం చేయడం, చెడు చేసేవాళ్లకి దూరంగా ఉండడం, తోటివారికి ఉపయోగపడే పనులు చేయడంలో వేగం ప్రదర్శించడం, ఇతరులు అడిగిన పనులను నెరవేర్చడం, ఎప్పుడైనా మేలే చేయడం, ఎదుటి వాళ్లు దుఃఖిస్తే తాము బాద µపడడం ఇవి కూడ వాళ్ల దృష్టిలో అప్టైశ్వర్యాలే.

''ఈ యజ్ఞవేదిక ఈ యజ్ఞశాల
ఈ యజ్ఞ మీ చెల్వకెంత మొప్పినదో
శ్రీ గణనాయకు చిత్తమున నిలిపి
శ్రీ గురు శ్రీ నివాసస్వామి తలతు
అనిపాడే జానపదుల పాటలోని భావన కర్మా చరణను నిరూపిస్తోంది. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుచున్న ఈ వ్యవహారాలు మన సంస్కృతికి మూలాధారం. అందుచేత ఈ కర్మ మార్గం మన ఐకమత్యానికి సూచిక. పుణ్యప్రాప్తికి ఆధారం.

0 comments:

Post a Comment