Sunday

గురుదేవోభవ

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి అయినా ఆదియుగం నుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి. జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు. సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. అతడే... ఉపాధ్యాయుడు, సృష్టి స్థితి లయల నిర్దేశకుడు! అలాంటి మహోన్నత మహాఋషికి నేటి సమాజంలో అడుగడుగునా ఆటంకాలే... వెటకారాలు, ఛీదరింపులు, వెండతెరపై ఆటపట్టింపులు... ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా... బుద్ధినే సిమెంటుగా, జ్ఞానాన్నే ఇటుకలుగా, వివేకాన్నే కాంక్రీటుగా మలిచి విజ్ఞానమనే భవంతుల్ని నిర్మిస్తున్న నిత్య శ్రామికుడు. నిత్యాణ్వేషిగా, నిత్య విద్యార్థిగా జ్ఞాన కుసుమాలు పూయిస్తున్న విజ్ఞాన ఖనిని గురుపూజోత్సవం’ సందర్భంగా మనసారా పూజించుకుందాం... మనసెరిగిన మాస్టార్లకు పాదాభివందనాలర్పిద్దాం...



బడి అనే నారుమడిలో...
విద్య అనే విత్తనం వేసి...
అక్షరం అనే నీరు పోసి...
చెడు అనే కలుపు తీసి...
మంచి, నీతి అనే ఫలాన్ని సమాజానికి...
అందించే ఉపాధ్యాయుడు స్పూర్తి ప్రదాత..!


4guru1పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమో గానీ, ఉపాధ్యాయు డు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పా ఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయు డికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట ్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలే దు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యా యుడు ఎక్కడివాడై నా ఆయన స్థానం అత్యుత్తమమైనది, అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సం బంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది.

ఆ శక్తి అనంతమైనది. విద్యార్ధి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యా ర్ధి సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యా యుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది. అదృష్టవశాత్తూ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మన దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానమే ఉంది. అందుకే ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 5వ తేదీన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. టీచర్స్‌ డేగా విదేశాల్లో కూడా అతి ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటారు. మన దేశాని కొస్తే సెప్టెంబర్‌ 5నే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఆ రోజు భారత ద్వితీయ రాష్టప్రతిగా అద్వితీయంగా తన పద వీ బాధ్యతలను నిర్వహించిన డా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (1888-1975) జన్మదినం కావడమే. 

1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షు డిగా పని చేసిన రాధాకృష్ణన్‌ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. స్వయంగా ఉపాధ్యాయుడైన ఆయన విద్య మీద అపార నమ్మకంగలవాడు. విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యానికి చు క్కానులని ఆయన విశ్వసించేవారు. వాస్తవాని కి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 5న జరపవలసిందిగా కోరిందీ ఆయనే. తన పుట్టిన రోజునాడు తనను అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన ఈ రోజు నన్ను అభినందించడంకంటే ఉపాధ్యాయుల ను అభినందించడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్‌ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేకమంది తమ గొప్పతనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం.

ఆచార్యదేవోభవ...
ssa3మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరు వాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. ‘గు’ అంటే గుహ్యమైనది, తెలియనిది. ‘రు’ అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యా ర్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. 

సాక్షాత్తూ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యా యుణ్ణి పంపిస్తే విద్యార్ధులు మాత్రం ఆయన్ను విస్మరించి మార్కుల కోసం, పరీక్షా ఫలితాల కోసం గుళ్ళూ, గోపురాల చుట్టూ తిరగడం శోచనీయం. ప్రయత్నం మానవ లక్షణం. వి ద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీ స్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటా యి. గురువు నుంచి వాటిని పొందడం ముం దుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడన్న వాస్తవాన్ని తల్లిదం డ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ త మ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవే ళలా అప్రమత్తంగా ఉంటాడు.

ఇక్కడ గురు శిష్య సంబంధం కూడా చర్చిం చతగ్గది. ఎందుకంటే విద్యార్ధుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముం దుంటాడు. అందుకోసం అతడు ఆ విద్యార్ధి తో ఎంతో చనువుగా మెలుగు తాడు. అతనితో స్నేహం చేస్తాడు. అతనిలోకి పరకాయ ప్రవే శం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపా ధ్యాయుడికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపా ధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచివుంటాడు. అం తేకాదు ఉపాధ్యాయుడు విద్యార్ధుల భవిష్యత్తు ను సన్మార్గంలోకి తీసుకెళ్ళే డ్రైవర్‌గానూ, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడుగానూ, వివిధ రకాల పరిస్థితులను విడమరచి చెప్ప డంలో సైంటిస్టుగానూ, కలబోసి వివరిస్తూ ఆపైవచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడి గానూ, అతనికి బలమైన నిర్మాణాత్మక శక్తిని చ్చేందుకు కాంట్రాక్టర్‌గానూ... ఇలా సంఘం లో ప్రతి వృత్తినీ తనలో ఇముడ్చుకొని, తానే అన్ని వృత్తులని నిర్వహించేవాడిగా విద్యార్ధికి సంపూర్ణ అవగాహన కలిగేట్లు చేస్తాడు.

Dr-S.Radhakrishnanవిద్యార్ధి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయుడితో తన పని పూర్తయి పోయిందను కోకూడదు. విద్యాలయం నుంచి బైటికొచ్చాకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసర మవుతుంది. అప్పటివరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఆ ఉపాధ్యా యుడి సందేశం మాత్రమే తోడుగా ఉంటుం ది. కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గర్నుంచి అప్పటి వరకు తాను నేర్చుకున్న నడవడి, క్రమశిక్షణ మాత్రమే అతను పై అంతస్తులకు ఎదిగేందు కు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్ధి అత్యం త జాగరూకతతో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తన గురువును తలుచుకుంటూ అడు గులేస్తే ఆ అడుగులు మరి అభ్యుదయంవైపే చకాచకా సాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

మాజీ రాష్టప్రతి కలాం కూడా గతంలో ఉపా ధ్యాయుడే. పదవీ విరమణ అనంతరం ఆయ న మరలా ఉపాధ్యాయ వృత్తిని చేపడుతుండ డం ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్నీ, విశిష్టత ను తెలియజేస్తుంది. ప్రపంచంలో ‘సర్‌’ అని ప్రతి ఒక్కరూ సంబోధించతగ్గ ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. దేశాధ్యక్షుడు సైతం ‘సర్‌’ అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉ పాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం. ఇది స ర్వత్రా వాంచనీయం. ఈ రోజుని ప్రతి విద్యా లయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించా లి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి. ఒకప్పుడు ‘బ్రతకలేక బడి పంతులు’ అనిపించుకున్న వృత్తి నేడు నేడు ‘బ్రతుకు కొరకు బడి పంతులు’ అని వేనోళ్ళ కీర్తించబడుతుందంటే అందుకు కారణం సంఘ నిర్మాణంలో ఉపాధ్యాయుడు నిర్వర్తించిన పాత్రతప్ప మరోటి కాదు.

kalamఅందుకే వేమన గారు అప్పిచ్చువాడు, వైద్యుడు, ఆగక పారే నీరు ఉన్న ఊరిలో ఎలా నివ శించమన్నాడో అలాగే ఉపాధ్యాయుడు లేని ఊరిలో మాత్రం ఉండరాదని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుడి అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ ఆచార్య దేవుణ్ణి అన్నివిధాలా గౌరవిస్తేనే మన సంస్కృతిని మ నం గౌరవించినట్లు. ఎందుకంటే ఉపాధ్యా యుడు లేని ఊరు, చుక్కాని లేని నావ ఒక్క టే. చుక్కాని లేని నావలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో ఉపాధ్యాయు డు లేని ఊరి ప్రజ అంతకంటే ఎక్కువ ప్రమాదకర పరిస్థిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిడ్డకి తల్లీ, తండ్రీ ఎంత అవసరమో, తల్లిదండ్రులకు ఉపాధ్యా యుడూ అంతే అవసరం. ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రతి పల్లె తమ ఊరు బాగుపడాలంటే ఉపాధ్యాయుడు తమకు కావాలనే అవసరాన్ని గుర్తిస్తే వారి జీవితాలు ఏరువాకలా ప్రశాంతంగా సాగుతాయి. ఆరుగాలం వారు శ్రమించి పండించిన పంటకు ఆరేడు కాలాలపాటు వర్ధిల్లేంతటి ఫలితమూ దక్కుతుంది. 

ఇది సత్యం!... ఇదే సత్యం!!
టీచర్స్‌ డే ఆద్యుడు సర్వేపల్లి...

డా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ భారతదేశపు మొ ట్టమొదటి ఉపరాష్టప్రతి, రెండవ రాష్టప్రతి కూ డా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ భారత రాష్ట్ర పతి అయిన తరువాత కొందరు శిష్యులు, మి త్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్ద కు వచ్చినప్పుడు, ‘నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్స వంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను’ అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

కీచకులూ ఉన్నారు...
సృష్టిలో మహో న్నత స్థానం గురువుది. అలాంటి గురువుకు ఈ రోజున సమాజంలో స్థానం ఎక్కడ. ఆ ది క్సూచికి దిక్కులు తెలి యకుండా అల్లాడే పరిస్థి తి ఎందుకు వచ్చిం ది. లోపం ఎక్కడుంది. ఇం దుకు కారణం ఎవరు. విద్యార్ధులు చదువుకునే రోజుల నుంచీ చదువు కొనే రోజుల్లో వున్నారు. బతకలేక బడిపంతులు... బతక నేర్చిన పంతులయ్యాడు. పూజ పేరు చెప్పి ఇలా విమర్శలకు దిగ డం తప్పే... కానీ ఇప్పటి పరిస్థితిని అకళింపు చేసుకోవడానికి మొదలు ఇదే అయితే బావుం టుంది. విద్యార్ధులకు పాఠాలు చెప్పే స్థాయి పోయింది. బతకడానికి దారి చూపే మార్గమ యింది ఉపాధ్యాయ వృత్తి. 

ఈ కొనుగోళ్ళ రో జుల్లో ఎందరో కీచకులు కూడా తయారవడం నేటి విద్యాలోకం సాధిం చిన అభివృద్ధి. ఇది ఎంతో విచారమైన స్థితిలో వుండి చెప్పక మానదు. ఆ సూర్యుడు పడమట ఉదయించి నా ఉపాధ్యాయుడు మాత్రం ఇలా కాకూడ దు. ఉపాధ్యాయులందరూ ఇ లాంటి వారే అని చెప్పడం కూడా సరికాదు... కానీ సమా జం ఒకానొక దుస్థితిలో ఉందని మాత్రం చెప్పక తప్పదు. గురువును పూజించడం విద్యార్ధులదే కాదు... సమాజం బాధ్యత కూ డా అంటారు. అంటే భావి సమాజం గురువు చేతుల్లో ఉందనే దీని భావన... 

guruvuluఅలాంటి గురువు నేడు ఎలాంటి పరిస్థితిలో వున్నాడు. పొట్టకూటికోసం పాకులాడే వాడు గురువా... పాఠాలు చెప్పడానికి పాకులాడే వాడు గురు వా అంటే... మీరు ఏ మాట వైపు మొగ్గుతా రు. అని ప్రశ్నిస్తే రెండో మాటే సమాధానం అవుతుందా. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండీ... ఇలాంటి ఎన్నో అనుమానాలున్నా యి. విద్యార్ధినులతో జతకూడుతున్నారు. వా రి మానాన్ని దోచుకుంటున్నారు. పదిమంది లో గురువు పేరును చెడగొడుతున్నారు.

సినిమాల్లో ‘గురు’స్థానం...
ప్రస్తుత సామాజిక స్థితికి దర్పణం పట్టే... నా టకాలు- సినిమాలు వంటి ఇతర కళారూపాల్లో గురువుస్థానం నానాటికీ దిగజారుతోంది. గురుత్వం మీద గురుత్వం లేకుండానే సాగు తున్నాయి సినిమాలు. ఎక్క డ కాలేజీ సీను చూసినా గురువనే పదార్ధానికి అర్ధం... నిరర్ద కం - నిష్ర్పయోజనం - నిష్క్రి యాతత్త్వం - నిర్వీర్యం. మంచి గురువు అతడి జీవనగమ నం అనే ప్రసంగం వెతకాలంటే వేనవేల టార్చిలైట్లు వేసుకునే వెతకాలి. అయినా మనిషిని కుక్క కరిస్తే వార్త ఎందుకు అవుతుం ది... అన్నట్టు, సరైన గురువును చూపడం సినిమా ఎందుకు అవుతుంది అన్నట్టుగా వుంది వ్యవహారం. 

ఒకనాటి విజయా వారి ‘మిస్సమ్మ’ చిత్రాన్ని తీసుకుంటే... ఈ సినిమా టైటిలే విద్యావ్య వస్థకు చెందినది. టీచరమ్మను మిస్సమ్మ అన డం అప్పటి ఆచారం. వాస్తవానికి మిస్‌ అనే పదానికి మిస్సమ్మ అనేది స్థానిక పదం. ఇక ఉపాధ్యాయుల గౌరవాన్ని పతాకస్థాయికి తెచ్చి న చిత్రంగా ‘బడిపంతులు’ పేర్కొనవ చ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌... విద్యార్ధికి ఒట్టి చదువే కాదు, ఇంకా ఎన్నో అవసరమైన విషయాల ను నూరిపోసే మాస్టారిగా నటించాడు. సహజీ వనమూ - సమభావనమూ - సమతా వాద ము వేదముగా అంటూ పిల్లలు ఏయే గుణా లు పెంపెందించుకోవాలో చక్కగా వివరిస్తుం ది ఎన్టీఆర్‌ పాత్ర. ‘భారతమాతకు జేజేలు బం గరు భూమికి జేజేలూ’ అనే పాటలో ఈ సుగుణాలన్నీ పిల్లల్లో ఉండాలని చెబుతుందీ పాత్ర. ఇక నలుపు... 

guruvuluuతెలుపులు పోయి రంగులు రావడంతో సినిమాల్లోని గురువులకూ అనేక రంగులద్దారు మనవా ళ్ళు. నియమాలు చెరిపేసారు. పాతదనానికి పాతరేసి కొత్తదనానికి జెండా నాటారు. క్లాసు రూముల్లోనే ‘సుందరకాండ’కు తెరలేపారు. ఉపాధ్యాయుడితో ప్రేమకలాపం నడిపే పరిస్థి తికి వచ్చింది. అయినా చిత్రం చివర్లో ట్రాజడీ గా చూపించేసి చేతులు దులిపేసుకున్నా టీచ ర్‌, స్టూడెంట్‌ల మధ్య ఉండే రిలేషన్‌షిప్‌నకు మాత్రం అర్థం చెప్పలేకపోయింది. హీరోలు టీచర్లయితే ఇలా ఎంతో ఔన్నత్యంతో కూడిన సన్నివేశాలనుంచి చిత్రిస్తారు. అదే కమెడియ న్లు గురువులయ్యారనుకోండి... ఇక చెప్పేదే ముందీ క్లాస్‌ రూం సర్కస్‌ కింద మార్చేస్తాయి సినీ బుర్రలు. ‘వారసుడు’ సినిమాలో నవ్వుల ఆనందం బ్రహ్మానందం క్లాస్‌ టీచరు. పాపం ఏనాడూ క్లాసు తిన్నగా సాగిన దాఖలా కనిపిం చదీ సినిమాలో... 

మొత్తం నవ్వులే నవ్వులు. దానికి తోడు ఇదే కాలేజీలో స్టూడెంట్‌ గా తన బావమరిది కూడా తోడవడంతో వాళ్ళ ఫ్యామి లీ డ్రామా కూడా క్లాస్‌ రూంలోనే పండిస్తారు దర్శకరచయితలు. ఈ సినిమాలో ఒకానొక దశలో తమ గురువుగారైన మూలశంక మా ష్టారికి దండేసి దండం పెట్టేస్తాయి స్టూడెంట్‌ వర్గాలు. పాపం తాను చావకుండానే పాడె కట్టేసిన స్టూడెంట్లను చూసి తల్లడిల్లి పోతాడు పాపం గురువుగారు. ‘నువ్వు- నేను...’ సిని మాలో గురువు ధర్మవరపు పాట్లు అన్నీ ఇన్నీ కావు. తమకు ఇష్టమొచ్చిన రీతిలో గురువు గిరీకి గీతలు గీస్తారు దర్శకరచయితలు. తన స్టూడెంట్‌ లైఫ్‌నే టీచింగ్‌ లైఫ్‌ లో కూడా కం టిన్యూ చేస్తున్నాడన్న చందంగా సాగుతుంది వ్యవహారం. 

అలాగని కొన్ని మంచి సినిమా లూ లేకపోలేదు. ఇటీవల రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన ‘ఓనమాలు’ చిత్రం కూడా గురువుగా గురుతర బాధ్యతలను బోధిస్తుం ది. అమీర్‌ఖాన్‌ తీసిన ‘తారే జమీన్‌ పర్‌’ చిన్న పిల్లల మనస్తత్వం గురించి అద్భు తంగా చెబు తుంది. ‘త్రీ ఇడియట్స్‌’ చిత్రం ఏకంగా విద్యా వ్యవస్థనే ప్రశ్నిస్తుంది. గురువు ల్లో రావాల్సిన మార్పును కళ్లకు కడుతుంది. స్వర్గీయ టి.కృష్ణ దర్శకత్వం వహించిన ‘రేప టి పౌరులు’ చిత్రంలో విజయశాంతి సామాజి క స్పృహ ఉన్న టీచర్‌గా చాలా చక్కగా నటిం చారు. అయితే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. గురువు ను వెండితెరపై బంగారు కొండగా చూపించా ల్సిన అవసరం ఉంది. అంతేకానీ అర్ధం పర మార్థం లేని, గురుస్థాయిని దిగజార్చే సినిమా లు ఇకముందైనా మానుకుంటేనే మాస్టారి ప్రతిభ వెండితెరపై కూడా విరాజిల్లుతుంది.

సారీ ‘టీచర్‌’...
ఇటీవల విడుదలకు సిద్ధమైన ‘సారీ టీచర్‌’ సినిమాకు సంబంధించిన పోస్టర్లు చూసి జ నం ఒక్కసారిగా కంగు తిన్నారు. లేడీ టీచర్‌ అందాల ప్రదర్శన... స్టూడెంట్‌ వంకర చూపు లతో ఉన్న ఈ పోస్టర్లు చూసి సభ్యత వున్న వాళ్లు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఉపా ధ్యాయ వృత్తిని అపహాస్యం పాలు చేసేలా... గురు శిష్యుల సంబంధాన్ని అపవిత్రం చేసేలా ఈ సినిమా ఉందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తా యి. యువతను పెడతోవ పట్టించే ఇలాంటి సినిమాలు సమాజానికి హాని చేస్తాయని ఆందోళనకి దిగారు. 

NTRinBadipantuluఈ నేపథ్యంలో గత నెల 24న విడుదల కానున్న ఈ సినిమాను వెంట నే నిలిపివేయాలంటూ వేసిన పిటీషన్‌ను హై కోర్టు స్వీకరించి సెన్సార్‌ చేయాల్సిందిగా కేం ద్ర సెన్సార్‌ బోర్డును... ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులతో ప్రస్తుతానికైతే సినిమా విడుదల వాయిదాపడింది. ఉపాధ్యాయ వృత్తిని అపహా స్యం చేస్తున్న ఇలాంటి చిత్రాలు ఇకపై తీయ బోమని దర్శకులు ప్రతినబూనాలి. ఇలాంటి సినిమాల వల్ల యువతలో ఉపాధ్యాయుడి పై ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ఇకనైనా దర్శకు లు ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని పెంపొందిం చేలా సినిమాలు తీస్తారని ఆశిద్దాం... 

పూరాణేతి హాసాల్లో... గ్రేట్‌ టీచర్స్‌
Taare_Zameenpar1. వశిష్టుడు (శ్రీరాముని గురువు)
2. సాందీపని (శ్రీకృష్ణుని గురువు)
3. విశ్వామిత్రుడు (శ్రీరాముని గురువు)
4. ద్రోణాచార్యుడు (కురుపాండవుల గురువు) 
6. వాల్మీకి (లవకుశుల గురువు, రామాయణ రచయిత)
7. వ్యాసమహర్షి (మహాభారతాన్ని రచించాడు)
8. శ్రీకృష్ణ పరమాత్మ (పాండవుల గురువు)

ఆధునిక భారతంలో... గ్రేట్‌ టీచర్స్‌
guru00
1. సర్వేపల్లి రాధాకృష్ణన్‌
2. సర్‌ సి.వి.రామన్‌
3. డా ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం 

భారత దేశ చరిత్రలో... గ్రేట్‌ టీచర్స్‌
1. రామకృష్ణ పరమహంస
2. శారదాదేవి
3. అభినవ గుప్త
4. ఆనందమయి మా
5. భగవాన్‌ నిత్యానంద
6. ఏక్‌నాథ్‌ మహరాజ్‌
7. గురుగోవింద్‌ సింగ్‌
8. గురునానక్‌
9. జానాబాయి
10. జ్ఞానేశ్వర మహరాజ్‌
11. కబీర్‌
12. మీరాబాయి
13. ముక్తాబాయి
14. నామ్‌దేవ్‌
15. నారద
16. రబియా బాస్రి
17. సక్కుబాయి
18. షిరిడీ సాయిబాబా
19. గౌతమ బుద్దుడు

20. స్వామి చిద్విలాసానంద
21. స్వామి ముక్తానంద
22. స్వామి వివేకానంద
23. తులసీదాస్‌
25. సమర్థ రామదాస్‌
26. శంకరాచార్య
27. సంత్‌ జ్ఞానేశ్వర్‌
28. చైతన్య మహాప్రభు
29. శ్రీ రామానుజాచార్య
30. దయానంద సరస్వతి

31. స్వామి రామతీర్థ
32. రాజా రామ్‌మోహన్‌ రాయ్‌
33. సామ్రాట్‌ అశోక్‌
34. మహవీర్‌ స్వామి
35. స్వామి శ్రద్ధానంద
36. శ్రీ అరవింద్‌ ఘోష్‌
37. మదర్‌ థెరీసా
38. చాణక్యుడు 

ప్రపంచంలో... గ్రేట్‌ టీచర్స్‌
1. కన్ఫ్యూసియస్‌
2. సోక్రటీస్‌
3. రోజర్‌ బేకన్‌
4. నాథన్‌ హాలే
5. అనీ సులివాన్‌
6. అలెన్‌ బ్లూమ్‌
7. జైమీ ఎస్కలాంటే
8. పైథాగరస్‌
9. జాన్‌ ఆడమ్స్‌
10. హరియట్‌ బీచెస్‌ స్టో
11. లియోనా ఎడ్వర్డ్‌‌స
12. వాల్ట్‌ వైట్‌మన్‌ 

0 comments:

Post a Comment