Sunday

1) నేత్రపర్వం... శ్రీ కూర్మం 2)జన్మభేదాలు చెప్పిన విష్ణువు

శ్రీ కూర్మంలో శిల్పళా శైలి ఎంతో విశిష్టమె ైనది. చిత్రంగా ఇక్కడి స్వా మి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉన్నా యి. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామా నుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు కూడా ఉన్నాయి.

స్థలపురాణం...
దక్షిణ సముద్ర తీరాన శ్వేతపురమనే పట్ట ణాన్ని శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చాడు. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండ బెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదన లేను, ఇటు నీ వ్రతాన్ని భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధాల వేడు కొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థిం చింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉధృతంగా రాజు వైపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతం మీదకు చేరి తమ మంత్రిని విషయం అడుగగా, అతను రాజుకు విషయమంతా వివరించాడు.

kurmsఅప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపానికి ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించాడు. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రా జు తన బాధను వివరించాడు. అప్పుడు నార దుడు రాజుకు శ్రీకూర్మ మంత్రాన్ని ఉపదే శించి దీక్షతో ధ్యానించమని చెప్పాడు. ఈ గం గా ప్రవాహం వంశధార అను పేరుతో సాగ రంలో లీనమవుతుందని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పాడు. రాజు వంశధారలో స్నా నమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరు ని, సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పు డు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజు కు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావి ష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండం నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమి చ్చాడు. 

స్వామి నాలుగు చేతులతో, శంఖం, చక్రం, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధించగా శ్రీమహావిష్ణువు కొలు వై ఉండేందుకు తనకు తగిన మంచి స్థాన మునకై రాజు, నారదునితో కలసి ఒక వట వృక్షం వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్ర యోగం చేశాడు. అక్కడ క్షీర సమానమైన జలం ఉద్భవించింది. ఈ గుండమునే కూర్మ గుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహా లక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగము నందు వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరు చుకొన్నాడు. 

Kurmశ్రీకూర్మక్షేత్రానికి వంశధారా నదీ తీరంలో శ్రీకూర్మశైలమను పర్వతం ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకం. క్షేత్రమునకు దక్షిణాన ప్రేతశిల అ ను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభిస్తుంది. శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారంగా వస్తున్నది


2)జన్మభేదాలు చెప్పిన విష్ణువు

దురాశ దుఃఖమునకు చేటు. ఆశ బాధలకు మూలకారణం అగుచున్నది. వైరా గ్యబుద్ధి కలిగి యుండవలెను. జన్మప్రకారం అట్టివాడే పుణ్యాత్ముడై సర్వసౌఖ్యాలను అనుభ వించును. అనంతరం గరుత్మంతుడు విష్ణు మూర్తికి నమస్కరించి ‘‘దేవా! మీ సూక్తులు దేవతలు, మానవులు, రాక్షసులు కూడా స మానంగా వినవలసినవి. వాటిని విని నేను ధన్యుడగు చున్నాను. నాయందు దయతో విషయమంతయూ సమగ్రముగా తెలియ జెప్పుము ప్రభూ! నా జన్మ ప్రకారమును గు రించి విపులంగా తెలుపండి’’ అని ప్రార్థించగా... శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో ఈ విధంగా పలికెను. ‘‘ఓయా! గరుత్మంతా! ప్రపంచం లో 84 లక్షల జీవులున్నాయి. మానవజన్మ అన్నింటికంటే గొప్పది. 

మానవుడు కాగోరువా డు ఈ 84 లక్షల జన్మవిభేదాలు పొంది మం చి ప్రవర్తనచే అనుకూలమైన అర్హతను ముం దుగా సంపాదించాలి. జీవబేధములు నాలు గు విధాలు. కొన్ని జీవులు గుండు నుండి పుట్టును. అవి పక్షులు మొదలుగునవి. అవి 21 లక్షలు. కొన్ని ప్రాణులు చెమట వల్ల పు ట్టును, అవి దోమలు మొదలైనవి. అవికూడా 21 లక్షలు. కొన్ని జీవులు భూమియందు పుట్టును. అవి వృక్షాలు. అవి కూడా 21 లక్షలు. మిగతావి మనుషులు, పశువులు మొదలైనవి. అవి 21 లక్షలు. ఇలా మొత్తం 84 లక్షల జన్మభేదాలను ప్రతి ప్రాణి పొంద వలసి ఉన్నది. ఓ గరుడా! వినుము. జన్మలలో మానవజన్మ మిక్కిలి గొప్పది. దానికి కార ణం మానవునికి ప్రకృతి సౌందర్యాన్ని చూచు టకు కనులున్నాయి. 

వాసన గ్రహించుటకు ముక్కు గలదు. దేవాలయాలకు మహర్షుల ఆశ్రమాలకు వచ్చుటకు కాళ్ళున్నాయి. దైవ మును పూజించుటకు, దైవ భక్తులను ఆరా ధించుటకు, అర్హతనుబట్టి దానం చేయుటకు చేతులు కలవు. మంచిచెడులను గ్రహించడా నికి మంచి బుద్ధి ఉన్నది. ఈ అవయవాలు మిగిలిన ప్రాణులకు కూడా ఉండవచ్చును. కాని వానికి ఏది మంచి? ఏది చెడు? అను నది తెలియదు. మంచిచెడులను తెలుసుకునే శక్తి మానవునికి మాత్రమే ఉన్నది. కాబట్టి మానవుడు సృష్టియందు మహనీయుడగుచు న్నాడు. మొదటివాడుగానూ పరిగణించబడు తున్నాడు. మానవజన్మను ఆశించు జీవులు పుణ్యకార్యాలు ఎక్కువగా చేసి ఉండాలి. అగ్ర వర్ణాల వారు అనగా బ్రాహ్మణులు, క్షత్రియు లు, వైశ్యు కులములయందు జన్మించుటకు మిక్కిలి కష్టపడవలెను. 

Vishnu03మానవులలో కొన్ని జాతులు శూద్రులు మొదలగు జాతులయం దు పుట్టువారు గతజన్మలో పాపాత్ములై ఉన్నా రు. సమస్త ప్రాణులకు ఆహార, నిద్రాభయ, మైదునములు సహజధర్మములు. బుద్ధిబల ము మానవులకు ఉన్న గొప్ప శక్తి. మానవజ న్మకు ముందుముందు ఎన్ని జన్మలు కలిగి యుందుము, దాని వరుసక్రమములు తెలిపె దను వినుము. ప్రేతదేహము ధరించిన తరు వాత ముందుగా పిశాచదేహము, తరువాత పక్షి జన్మ, తరువాత పశు జన్మ, ఆ తరువాత నే మానవజన్మము కలుగును. మానవజన్మ యందు బ్రాహ్మణుడుగా జన్మించుట మిక్కిలి శ్రేష్ఠము. వేదాలను చదువుటకు, ఆచారవ్య వహారాలతో కూడిన ధర్మబద్ధముగా భగవం తు నియందు భక్తి కలిగియున్నవారింట జన్మించినంత మాత్రాన పుణ్యము రాదు. 

వంశమునకు తగిన మర్యాదలు, మంచితనం, విద్య, వినయం మొదలగు సద్గుణాలు కలిగి ఉండాలి. ఎవరునూ విషయాసక్తులు కాకూ డదు. అన్ని అనర్ధాలకు ఇంద్రియములే కార ణమని భావించాలి. ఇంద్రియ నిగ్రహము కలవాడే పండితునిగా పిలువబడతాడు. వేదా ధ్యయనము వల్ల మాత్రమే పండితుడు కాలేడు. వేదహితమైన కర్మలను చేయువారే పండితులు. ఇంద్రియములు విషయములకు ఎట్లు కారణభూతమగుచున్నవో చెబుతాను వినుము. అరణ్యమధ్యమము నందు ఒక కిరాతుడు హాయిగా పిల్లనగ్రోవిని ఊదుచుండెను. ఆ గానమాధుర్యమునకు ఒక అమాయకమైన జింకపిల్ల అచటికి 
వచ్చి అక్కడే పొంచియున్న వలను తగులుకొని బాధపడుచుండెను. జిం పిల్ల శ్రవణేంద్రియముల వలన దుఃఖము పొందినది. 

మరొక చోట ఒక బోయవాడు ఏనుగును పట్టుకొనుటకు ఒక గోతిని త్రవ్వి పెట్టి తాను పెంచుకొనుచున్న ఏనుగును ఆ గోతి పక్కనే ఉంచినాడు. దానితో కలిసి సుఖించుదామని ఆ మగ గజము ఆశపడి వచ్చి గోతిలో పడి విచారించెను. ఆ ఏనుగు దుఃఖ మునకు కారణము ‘త్వక్‌’ ఇంద్రియ ము కాదా? పాపం సర్వసుఖము పొందుదా మనుకొని బాధలు కొనితెచ్చుకున్నది. అదేవిధంగా తేనెటీగ మిక్కిలి కష్టపడి తేనెను సేకరించింది. దానిని ఒక బోయవాడు అపహరించదలిచి ఈగలను చెట్టుతో సహా తగులబెట్టినాడు. 

ఆ తేనెటీగ మరణమునకు ‘జిహ్వ’ కారణం కా దా? చేపగాలమునకు పెట్టియుంచిన ‘ఎర’కు ఆశపడి వచ్చి గాలమునకు చిక్కుకొనును. దాని దుసి్థతికి ముక్కు అనే ఇంద్రియము కారణ మగుచు న్నది. కోరికలతో రగిలిపోయే మాన వుడు పరాయి స్ర్తీల బాహ్యసౌందర్యం చూసి పరవ శుడైపోవుచున్నాడు. వారితో కలిసి సు ఖించా లని తలిచి, పెద్దలచే తిట్లు తినుచున్నాడు. దీనికి కారణం నేత్ర ఇంద్రియము కాదా?
ఓ వైనతేయా! లోకమునందుగల జీవరాశు లన్నియు ఇంద్రియములకు లోనై ఎన్నెన్ని బాధలు పడుచున్నవో గ్రహించితివి కదా! ఆశ వలనే ఇదంత యూ జరుగుచున్నది.

0 comments:

Post a Comment