Sunday

పశువుల నుంచి సోకే బ్రూసెల్లా

పశువుల నుంచి మనుష్యులకు సోకే వ్యాధులను జూనోటిక్‌ వ్యాధులని అంటారు. ఇలాంటి వాటిలో ముఖ్యమైంది బ్రూసెల్లా. ఇది రెండు రకాలు. బ్రూసెల్లా అబార్టస్‌, బ్రూసెల్లా మెలిటెన్సిస్‌. వీటిలో బ్రూసెల్లా మెలిటెన్సిస్‌ అతి ప్రమాదకారి.

వ్యాప్తి చెందు విధానం:
  • వేడి చేయని పాలు (పచ్చిపాలు) తాగడం ద్వారా
  • తెగిన చర్మం గుండా శరీరం లోకి చొచ్చుకుపోవడం ద్వారా కళ్ళలోకి పోవడం
  • వ్యాధికారకంతో కలుషితమైన గాలి పీల్చడం ద్వారా
  • పరిశోధనశాలలో కలుషితమైన వస్తువుల ద్వారా
  • వృత్తిపరంగా రైతులు, పశువైద్యులు, కసాయి వారి ద్వారా
  • వ్యాధి లక్షణాలు:
  • దీర్ఘకాలికమైన తీవ్ర జ్వరం
  • కీళ్ళనొప్పులు
  • చేదు వాపు
  • వెన్ను కింది భాగంలో నొప్పి
  • రాత్రి పూట చెమటలు పట్టడం
  • దగ్గు, శ్వాస ష్టమవడం
  • పొట్టలో నొప్పి, వాంతులు
  • ఈ లక్షణాలు కన్పించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స పొందాలి.

0 comments:

Post a Comment