Tuesday

భారత్ జోక్యం తగదు అబూసలేం వ్యవహారంలో పోర్చుగల్ రాజ్యాంగ న్యాయస్థానం...


అబూసలేం అప్పగింత వ్యవహారంలో భారత్‌కు చుక్కెదురైంది. అప్పగింత ఒప్పందం రద్దు విషయంలో జోక్యం చేసుకునే అర్హత ఆ దేశానికి లేదని పోర్చుగల్ అత్యున్నత రాజ్యాంగ న్యాయస్థానం తేల్చి చెప్పింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడైన సలేం పోర్చుగల్ పోలీసులకు 2002లో చిక్కాడు. ఈ కేసు విచారణ నిమిత్తం సలేంను, ఆయన స్నేహితురాలు మోనికాబేడీని 2005లో భారత్‌కు అప్పగించింది.

ఉరిశిక్ష పడే విధంగా సలేంపై సీబీఐ అభియోగాలను మోపడంతో.. ఆ అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేస్తూ పోర్చుగల్‌లో దిగువ కోర్టు తీర్పు చెప్పింది. దానినే ఖరారు చేస్తూ అక్కడి సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో ఉత్తర్వులు వెలువరించింది. దీనిని భారత్ సవాల్ చేయడాన్ని పోర్చుగల్ రాజ్యాంగ న్యాయస్థానం తప్పుబట్టింది. భారత్ తనంతట తానుగా జోక్యం చేసుకొనే అర్హత లేదని స్పష్టం చేసింది.

0 comments:

Post a Comment