Thursday

బెంగాల్‌లో అరాచకత్వం...!


  •  వికలాంగ క్రీడాకారిణిపై అత్యాచారం 
  •  ఎన్‌పిఆర్‌డి తీవ్ర ఖండన
పశ్చిమ బెంగాల్‌లో వికలాంగ మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనల జాబితాలో మరొకటి చోటు చేసుకుంది. ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలో చెవిటి, మూగ బాలికపై జరిగిన అత్యాచార ఘటనను జాతీయ వికలాంగ హక్కుల వేదిక(ఎన్‌పిఆర్‌డి) తీవ్రంగా ఖండించింది. బాధితురాలు జాతీయ స్థాయి (వికలాంగుల విభాగంలో) అథ్లెట్‌. 2006లో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ సహా అనేక పతకాలను గెలుచుకుంది. ఈ నెల 23వ తేదీన రారుగంజ్‌ నుండి హెమ్టాబాద్‌లోని తన ఇంటికి వెళుతుండగా ఆమెపై అత్యాచారం జరిగింది. ఒక ఆటో డ్రైవర్‌ ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్ళి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు రుజువైంది. నిందితుడిని అరెస్టు చేశారని ఎన్‌పిఆర్‌డి సహాయ కన్వీనర్‌ మురళీధరన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలే జాతీయ మహిళా కమిషన్‌ బృందం బెంగాల్లో పర్యటించి అత్యాచారాల కేసుల్లో ప్రభుత్వం సరిగా వ్యవహరించడంలేదని తీవ్రంగా అభిశంసించింది. బంకురా కేసు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ దాన్ని తీవ్రంగా ఖండించింది. ఆస్పత్రి ఆవరణలో వికలాంగురాలైన రోగిపై అత్యాచారాన్ని తీవ్రంగా నిరసించింది. ఆ రేపిస్ట్‌ తృణమూల్‌కు చెందినవాడని తేలిన తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు ఆ బాధితురాలి పుట్టుపూర్వోత్తరాలు ప్రశ్నించడం చాలా దారుణమని పేర్కొంది. అత్యాచార బాధితుల్లో 17 శాతం మంది వికలాంగులేనని మైత్రి అనే ఎన్‌జిఓ తన విశ్లేషణలో పేర్కొంది. తాజా ఘటనలో బాధితురాలికి తమ పూర్తి సహాయ సహకారాలుంటాయని ఎన్‌పిఆర్‌డి కన్వీనర్‌, పశ్చిమ బంగా రాజ్య ప్రతిబంధి సమ్మీళని కార్యదర్శి కాంతి గంగూలీ హామీ ఇచ్చారు. ఆమె పునరావాసానికి సాయమందిస్తామన్నారు. ఉత్తర దినాజ్‌పూర్‌ ఎస్‌పి కార్యాలయం ముందు నిరసన కూడా పాటించారు. జులై 6న కోల్‌కతాలో ప్రదర్శనకు పిలుపునిచ్చారు.
నిందితుని రక్షించే మమత చర్యలకు ఎన్‌పిఆర్‌డి ఖండన
అథ్లెటిక్స్‌లో 2006 నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన వికలాంగ(మూగ) యువతిని అత్యాచారం చేసిన నిందితుని రక్షించడానికి ప్రయత్నిస్తున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్యలను వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. నిందితునిపై తక్షణం చర్యలు తీసుకుని జైలుకు పంపించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి రాజేందర్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మమత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 

0 comments:

Post a Comment