Thursday

వైద్యుల నిర్లక్ష్యంతో 23 మంది చిన్నారులకు హెచ్ఐవీ


విధి ఆ చిన్నారులను అప్పటికే కాటేసింది. తలసీమియా వ్యా« దితో వారి జీవితానికి సరిహద్దులు గీసింది. ఎప్పటికప్పుడు వారి దేహంలోకి తాజా రక్తం ఎక్కిస్తేనే ఆ చిన్నారులు ప్రాణాలతో జీవిస్తారు. అలాంటి పసివారికి .. కళ్లు మూసుకుపోయి న.. నిర్లక్ష్యం తలకెక్కిన వైద్య సిబ్బంది హెచ్ఐవీ రక్తం ఎక్కించారు. ఫలితం.. అసలే ఒక మ హమ్మారితో పోరాటం చేస్తున్న 23 మంది గుజరాతీ చిన్నారులు మరో రక్కసి(ఎయిడ్స్) బా రిన పడ్డారు. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ గుజరాత్ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్లక్ష్య ఘటనపై రాష్ట్ర పోలీసుల దర్యాప్తు పట్ల ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది.

పోలీసుల ఎఫ్ఐఆర్‌లో సర్వోదయ రక్తనిధి కేంద్రం పేరున్నప్పటికీ.. స్థానిక ఆస్పత్రి ఆవరణలో అది ఇంకా కొనసాగుతూ ఉండడం.. దానికి లైసెన్స్ లేకపోవడాన్ని ధర్మాసనం ఉదహరించింది. 23 మంది అమాయక చిన్నారులు హెచ్ఐవీకి గురవడం చరిత్రలోనే అరుదైనదిగా «తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ భట్టాచార్య, జస్టిస్ జేబీ పార్ధివాలతో కూడిన దర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయవాది గిరీష్‌దాస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు బెంచ్ తమకున్న అధికారాలతో ప్రజల్లో విశ్వాసం కలిగించడం కోసం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు స్పష్టం చేసింది.

0 comments:

Post a Comment