Thursday

(యోగా) తో దృఢమైన వెన్నెముక

మన శరీరం వయసు మన వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. వెన్నెముక ఎంత బాగా స్ట్రెచ్ అయితే అంత ఆరోగ్యంగా మనం ఉండగలం. యోగా వలన మనం ఏజింగ్ ప్రక్రియను నెమ్మది చేయగలం. వెన్నెముకను దృఢంగా ఉంచే కొన్ని ఆసనాలు మీకోసం


మార్జాలం
మార్జాలం అనగా పిల్లి. పిల్లిని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది
పద్ధతి :
ముందుగా మోకాళ్లు అరచేతులు భూమి మీద ఉంచాలి. అరచేతులు భుజాలకు సమాంతరంగా ఒకే రేఖలో ఉండాలి. నడుము భాగానికి సమాంతరంగా మోకాళ్లు ఉండాలి. అరచేతి వేళ్లు ముందుకు వంచాలి. ఇప్పుడు గాలి దీర్ఘంగా పీలుస్తూ తలపైకి ఎత్తాలి. గాలి వదులుతూ నెమ్మదిగా తలను పొట్టవైపుకు తీసుకెళ్లాలి. పొట్ట లోపలికి లాగుతూ వీపును వీలున్నంత పైకి స్ట్రెచ్ చేయాలి. వెన్నెముకను పైవైపుకు ఆర్చ్‌లాగా స్ట్రెచ్‌చేసి 5 సెకన్ల పాటు అలా ఉంచాలి. తిరిగి గాలి పీల్చుతూ యథాస్థితికి రావాలి. దీనిని పదిసార్లు రిపీట్‌చేయాలి. ఈ ఆసన స్థితిలో మన దృష్టి అంతా మెడ భాగం నుంచి తుంటి భాగవరకూ ఉన్న వెన్నెముకపై ఉండాలి.
ఉపయోగాలు :
- డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం
- పొత్తికకడుపు ప్రాంతాన్ని బలపరుస్తుంది.
- ముఖ్యంగా స్త్రీలకు ఈ ఆసనం ఉపయోగకరం.
- పునరుత్పత్తి అవయవాలకు బలం చేకూరుస్తుంది.
- మెడనొప్పి ఉన్నవారు తలను పొట్టవైపు తీసుకెళ్లకపోవడం మంచిది.
- కాళ్లను శక్తివంతం చేస్తుంది.
- ఉదరంలోని అంతరంగాలు అన్నింటికీ మంచి మసాజ్‌ను ఇస్తుంది.

వ్యాఘ్రాసనం
వ్యాఘ్ర ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనికి వ్యాఘ్రాసనం అని పేరు వచ్చింది.
పద్ధతి :
ముందుగా మోకాళ్లు అరచేతుల మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. గాలి పీల్చుకుంటూ కుడి మోకాలును వెనుకగా వీలున్నంత పైకి తీసుకెళ్లాలి. ఈ స్థితిలో 5 సెకన్ల పాటు ఉంచాలి. మన ఏకాక్షిగత అంతా వెన్నెముక పైన, నడుముపైన ఉంచాలి. ఇప్పుడు గాలి వదులుతూ మామూలు స్థితికి రావాలి. ఇప్పుడు మరలా గాలి పీల్చుతూ ఎడమవైపు కూడా ఇదే మాదిరిగా చేయాలి. ఇలా కుడికాలితో ఐదు సార్లు, ఎడమకాలితో ఐదుసార్లు చేయాలి.
ఉపయోగాలు :
వెన్నెముకను దృఢపరుస్తుంది. స్త్రీలలో పునరుత్పత్తి అవయవాలను ఆరోగ్యంవంతంగా చేస్తుంది. మణికట్టును దృఢ పరుస్తుంది.

మార్జాలాసనం-2
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. తరువాత రెండు చేతులను భూమిమీద ఆన్చాలి. అరచేతులు, భుజాలకు, మోకాళ్లు నడుముకు సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు గాలి పీల్చుకుని కుడిచేతిని ముందుకు, ఎడమకాలిని వెనుకకు చాచాలి. 5 సెకన్లపాటు ఇదే స్థితిలో ఉండి గాలి వదులుతూ యథాస్థితికి రావాలి. ఇప్పడు మళ్లీ గాలిపీలుస్తూ ఎడమచేతిని ముందుకు, కుడికాలిని వెనుకకు చాచాలి. 5 సెకన్లపాటు ఈ స్థితిలో ఉండాలి. సమయంలో కుడి, ఎడమ కాలుపై శరీరంను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా కూడిచేతితో ఐదుసార్లు, ఎడమచేతితో ఐదుసార్లు రిపీట్ చేయాలి.
ఉపయోగాలు :
- చేతులు, కాళ్లు దృఢంగా తయారవుతాయి.
- వెన్నెముకకు సంబంధించిన నరాలు అన్నీ ఉత్తేజితమవుతాయి.

0 comments:

Post a Comment