Friday

యోగాసనాలు

త్రికోణాసనం
త్రికోణ అనగా త్రిభుజం. ఆసన స్థితిలో శరీరం త్రిభుజమును పోలి ఉంటుంది. అందుకే దీనికి త్రికోణాసనం అని పేరు వచ్చింది.

పద్ధతి :
ముందు నిటారుగా నిలబడాలి. ఇప్పుడు రెండు పాదాలు వీలున్నంత దూరంగా ( ఒక మీటరు ) జరపాలి. రెండు చేతులను భూమికి సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి. తరువాత గాలి వదులుతూ కుడి చేతిని కుడి పాదానికి ఆన్చాలి. ఎడమచేతిని తలమీదుగా నిలువుగా ఉంచాలి. తలను ఎడమచేతివైపు తిప్పాలి. ఇదే స్థితిలో 5 సెకన్ల నుంచి ప్రారంభించి నెమ్మదిగా సమయం పెంచుతూ పోవాలి. తిరిగి గాలి పీల్చుకుంటూ మామూలు స్థితికి రావాలి. ఎడమవైపు కూడా ఇదే విధంగా చేయాలి.

ఉపయోగాలు :
నడుము నుంచి కింది భాగంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
చేతులు, కాళ్లు, భుజాలకు మంచి షేప్‌ను ఇస్తుంది.
వెన్నెముకకు బలం చేకూరుస్తుంది.
పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజితం చేస్తుంది.

పార్శ్వ కోణాసనం 
పద్ధతి :
మొదట నిటారుగా నిలబడాలి. గాలి పీల్చుకుని రెండు పాదాలు ఒక మీటరు దూరం జరపాలి. అరచేతులు భూమివైపుగా ఉండాలి. నెమ్మదిగా గాలి వదులుతూ కుడిపాదాన్ని కుడివైపుగా తిప్పుతూ 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఎడమకాలును వంచకూడదు. కుడి అరచేతిని కుడికాలి పక్కగా ఉంచి ఎడమ చేతిని ఎడమచెవి మీదుగా భూమికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో అరనిమిషం పాటు గాలి మామూలుగా పీలుస్తూ ఉండాలి. గాలిపీలుస్తూ ముందుగా కాలును, తర్వాత చేతిని యథాస్థితికి తీసుకురావాలి. ఇదే మాదిరిగా ఎడమవైపు కూడా చేయాలి.

ఉపయోగాలు :
కాలి మడమలు, మోకాళ్లు మొదలైన వాటిని ఉత్తేజపరుస్తుంది.
సయాటికా మరియు కీళ్లనొప్పులను నివారిస్తుంది.
నడుం చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది. మలబద్దకం నివారిస్తుంది.

జాగ్రత్త :
మోకాలి నొప్పులు ఉన్నవారు చేయకూడదు.
వీరభవూదాసనం
పద్ధతి :
దీనినే వారియర్ పోస్ అని కూడా అంటారు. ముందుగా నిటారుగా నిలబడాలి. రెండు కాళ్లను మీటరు దూరంలో ఉంచి కుడికాలు పాదాన్ని కుడివైపుగా తిప్పాలి. ఇప్పుడు మోకాలిని 90 డిగ్రీల కోణంలో వంచాలి. రెండు చేతులనూ తలమీదుగా తీసుకెళ్లి జోడించి శరీరాన్ని ( నడుము నుంచి పై భాగాన్ని ) కుడివైపుగా తిప్పాలి. తలను పైకి లేపి జోడించిన చేతులను చూడాలి. శ్వాస మామూలుగా తీసుకుంటూ 20 సెకన్ల నుంచి 60 సెకన్ల్ల వరకూ ఉండటానికి ప్రయత్నించాలి. తరువాత నెమ్మదిగా శరీరాన్ని పైన చెప్పిన దానికి రివర్స్‌లో మామూలు స్థితిలోకి తేవాలి.

ఉపయోగాలు :
ఈ ఆసన స్థితిలో ఛాతి పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి గాలి బాగా పీల్చుకోగలుగుతాం. భుజాలలో, వీపులో స్టిఫ్‌నెస్‌ను తగ్గిస్తుంది. మెడలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. నడుము, పిరుదలలో ఉండే కొవ్వును బాగా తగ్గిస్తుంది.

జాగ్రత్తలు :
బలహీనమైన గుండె ఉన్నవారు చేయకూడదు. ఈ ఆసనం కొద్దిగా స్ట్రెయిన్‌తో కూడినది కాబట్టి బలహీనంగా ఉన్నవారు ఎక్కువసేపు ఈ ఆసన స్థితిలో ఉండలేరు.

పరివృత్త త్రికోణాసనం పద్ధతి :
పరివృత్త త్రికోణాసనం నిటారుగా నిలబడాలి . రెండు పాదాలను ఒక మీటరు వెడల్పు దూరంగా ఉంచాలి. రెండు చేతులను భూమికి సమాంతరంగా, భుజాలకు సమంగా చాచాలి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని గాలి వదులుతూ కుడి చేతిని ఎడమ పాదానికి ఆన్చాలి. చేతిని వెనకవైపుగా తలమీదుగా నిటారుగా ఉంచి చూపును ఎడమ చేతివైపు ఉంచాలి. ఇదే స్థితిలో కొన్ని సెకన్లు ఉండి యథాస్థితికి రావాలి. తిరిగి ఇదే పద్ధతి ఎడమవైపు కూడా చేయాలి.

ఉపయోగాలు :
ఈ ఆసనం స్త్రీలు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే నడుము సన్నబడుతుంది.
పునరుత్పత్తి అవయవాలకు కూడా చాలా మంచిది.

0 comments:

Post a Comment