Saturday

రవితేజ పక్కన తాప్సీ లేదట...!


సూర్య - రవితేజా హీరోలుగా తమిళంలో ఓ సినిమా ప్లాన్ చేశారు దర్శకుడు వెంకట్ ప్రభు. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా సోనం కపూర్, రవితేజా జోడీగా తాప్సీ ని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాతో తనకి ఎటువంటి సంబంధం లేదని, ఎవరూ తనని సంప్రదించలేదనీ తాప్సీ తేల్చి చెప్పేసింది. యూనిట్ సభ్యులు మాత్రం ఆమె మాటల్లో నిజం లేదని అంటున్నారు. రవితేజా సరసన కథానాయికగా తాప్సీ ని అనుకోవడం జరిగిందనీ ... ఈ విషయమై ఆమెని సంప్రదించడం కూడా జరిగిందని అంటున్నారు. ఆమె తన రెమ్యునరేషన్ పెంచేసి చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకుని వెనక్కి వచ్చేశామని చెబుతున్నారు. తాప్సీ అంత స్పీడ్ గా స్పందించడం వెనుక అసలు కథ ఇదేనని అంటున్నారు. కారణం ఏదైనా ఈ సినిమాలో తాప్సీ లేదన్నది మాత్రం నిజమని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె 'గుండెల్లో గోదారి' ... 'దరువు' ... 'షాడో' ... చిత్రాల్లో నటిస్తోంది.

0 comments:

Post a Comment