Saturday

మిసెస్ నోకియా కలలు నెరవేరేనా...?


మోడల్ గా ఓ మోస్తారు అవకాశాలను ...  నటి గా ఓ నాలుగు సినిమాలను సంపాదించుకున్న సన్నజాజి సౌందర్యం సనాఖాన్. ఓ వైపున హిందీ -  తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఈ నాయిక, తెలుగు లోనూ 'కత్తి' ...'గగనం' వంటి చిత్రాల్లో కనిపించింది. అందంలేని అభినయం ... అభినయంలేని అందం సినిమా ఫీల్డ్ లో రాణించవని గట్టిగా నమ్ముతోన్నఈ అమ్మాయి 'మిస్టర్ నోకియా'లో మంచు మనోజ్ సరసన నాయికగా స్థానాన్ని దక్కించుకుంది. అలాగే తమిళ - కన్నడ సినిమాల్లోనూ మంచి పాత్రలనే చేజిక్కించుకుందట. 'మిస్టర్ నోకియా' సినిమాలో తనది ఇన్నోసెంట్ గా కనిపించే కంత్రీ పిల్ల పాత్ర అనీ ... తనకి మంచి పేరు తెస్తుందని చెబుతోంది. తమిళ - కన్నడ సినిమాల్లోనూ గుర్తుండిపోయే పాత్రలు చేస్తున్నానని అంది. ఈ మూడు భాషల్లో వస్తోన్న ఈ సినిమాలు తన భవిష్యత్తుని నిర్ణయిస్తాయని చెబుతోంది. అమ్మడి కలలు ఎంతవరకూ నిజమౌతాయన్నది వేచి చూడాలి మరి.

0 comments:

Post a Comment