Saturday

తెలుగు ప్రేక్షకుల్ని ఆహ్వానిస్తోన్న 'జురాసిక్ ద్వీపం'





       ఈమధ్య కాలంలో ఇంచుమించు ప్రతి హాలీవుడ్ సినిమా భారతీయ భాషల్లోకి కూడా అనువాదం అవుతోంది. ఈ కోవలో తాజా హాలీవుడ్ సినిమా 'జబ్బార్ వోకి' కూడా చేరుతోంది. యూనివర్సెల్ మూవీస్ సమర్పణలో కోరుకొండ వరహాలరావు ఈ చిత్రాన్ని 'జురాసిక్ ద్వీపం' పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. స్టీవెన్ ఆర్. మోన్రో  దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు హాలీవుడ్ లోనూ, ఇటు తెలుగులోను మార్చ్ 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ ఆకారంలో ఉన్న ఓ రాక్షస పక్షి మనుషుల ప్రాణాలు తీసేస్తూ, భయభ్రాంతులకి గురిచేస్తుంటుంది. ఆ రాకాసి పక్షిని సంహరించేందుకు ఓ నలుగురు వీరులు సిద్ధపడతారు. భయంకరమైన ఆ పక్షిని వాళ్లు ఎలా ఎదుర్కున్నారనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది. ఒళ్లుగగుర్పొడిచే పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయని నిర్మాత అంటున్నారు.

0 comments:

Post a Comment