Saturday

ఉబ్బరాన్ని తగ్గించే...

ఏకపాద పవన ముక్తాసనం


ముందుగా వెళ్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకుని కుడికాలిని 90 డిగ్రీల కోణంలో లేపాలి. గాలి వదులుతూ కాలిని రెండు చేతులతో పట్టుకోవాలి. అదే సమయంలో తలను, భుజాలను నేలమీద నుంచి పైకి లేపి తలను మోకాలికి ఆన్చాలి. అలా ఐదు సెకన్లపాటు ఆపి... నెమ్మదిగా గాలిపీలుస్తూ తలను వెనక్కు తీసుకురావాలి. గాలి వదులుతూ కాలు యథాస్థితికి తేవాలి. ఈ విధంగా రెండు కాళ్లతో మూడు సార్లు రిపీట్ చేయాలి.

ద్విపాద పవనముక్తాసనం 
ముందుగా వెళ్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకుని రెండుకాళ్లను 90 డిగ్రీల కోణంలో లేపాలి. గాలి వదులుతూ కాళ్లను రెండు చేతులతో పట్టుకోవాలి. అదే సమయంలో తలను, భుజాలను నేలమీద నుంచి పైకి లేపి తలకు రెండు మోకాళ్లను ఆన్చాలి. అలా ఐదు సెకన్లపాటు ఆపి... నెమ్మదిగా గాలిపీలుస్తూ తలను వెనక్కి తీసుకురావాలి. గాలి వదులుతూ కాలు యథాస్థితికి తేవాలి. ఈ విధంగా మూడు సార్లు రిపీట్ చేయాలి.
AGR-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
రోలింగ్
ద్విపాద పవనముక్తాసనం మాదిరిగానే రెండు కాళ్లు పట్టుకుని ముందుకూ, వెనకకూ 10 సార్లు రోల్ చేయాలి. ఇది వెన్నెముకకు మంచి మసాజ్‌ను ఇస్తుంది.

పవనముక్తాసనం లెగ్ రొటేషన్
వెల్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకుని కుడికాలిని మడిచి ముందుకు తేవాలి. గాలి వదులుతూ తలను మోకాలికి ఆన్చి అదే స్థితిలో ఎడమకాలిని పైకి లేపి 5 సార్లు కుడివైపుగా, ఐదు సార్లు ఎడమవైపుగా రొటేట్ చేయాలి. ఎడమకాలు కింద పెట్టి గాలి పీలుస్తూ తలను వెనక్కి వంచాలి. గాలి వదులుతూ నెమ్మదిగా కుడికాలును నెమ్మదిగా కింద ఆన్చాలి.

ఇదేవిధంగా గాలి పీల్చుకుని ఎడమకాలిని మడిచి ముందుకు తేవాలి. గాలి వదులుతూ తలను మోకాలికి ఆన్చి అదే స్థితిలో కుడికాలును పైకి లేపి ఐదు సార్లు కుడివైపుగా, ఐదుసార్లు ఎడమవైపుగా రొటేట్ చేయాలి. అనంతరం కుడికాలును కింద పెట్టి, గాలిపీలుస్తూ తలను వెనక్కి తీసుకెళ్లాలి. నెమ్మదిగా గాలి వదులుతూ ఎడమకాలును కూడా కింద పెట్టాలి.

ఉపయోగాలు :
- పొట్టచుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది.
- పాన్‌క్షికియాస్8 (క్లోమక్షిగంథి)ని ఉత్తేజితం చేస్తుంది. కనుక డయాబెటిస్8 ఉన్నవారికి మంచిది.
- కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
- నడుము భాగాన్ని ఉత్తేజితం చేస్తుంది.
- పునరుత్పత్తి అవయవాల పనితీరును క్రమపరుస్తుంది.
జాగ్రత్తలు :
- మెడనొప్పి, బీపీ ఉన్నవారు తలను పైకెత్తకుండా ఉండాలి.
- స్లిప్‌డిస్క్, సయాటికా ఉన్నవారు నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి. 

0 comments:

Post a Comment