Friday

బ్యాలెన్సింగ్ పెంచే నటరాజాసనం...!


మన మనసులో ప్రవేశించే రకరకాల ఆలోచనల నుంచి క్లియర్ చేయడమనే ప్రక్రియనే మెడి మనం పీల్చే గాలి మీద కాన్‌సన్‌వూటేట్ చేస్తూ శరీరాన్ని మనసును ఉత్తేజితం చేయడమే మెడి బాగా నిద్రపోయి లేచినప్పుడు మనం ఎలా అయితే రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతామో ఒక మంచి మెడి తర్వాత కూడా అలాగే ఫీలవచ్చు. మనం చేసే పనులకు చాలా ఆలోచనలు ఎంత అవసరమో... బాడీకి రిలాక్స్ అవ్వాల్సిన అవసరం కూడా అంతే ఉంది.

అలాంటి ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ మీకోసం
పద్ధతి :

స్థిరంగా ఒక ప్రదేశంలో కూర్చోవాలి. కుర్చీలో కానీ, పడుకొని కానీ, సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ మనకు అనుకూలంగా ఉండేటట్లు కూర్చోవాలి. ఒక నిమిషం పాటు సాధారణంగా శ్వాస తీసుకోవాలి. మనసును ఏదైనా సమస్య బాధిస్తున్నటె్లైతే అది సమసిపోతుందని మనసుకు సర్ది చెప్పుకోవాలి. ఇప్పుడు 8 అంకెలు లెక్కపెడుతూ గాలి ధీర్ఘంగా పీల్చుకోవాలి. ఎనిమిది అంకెలు లెక్కపెడుతూ గాలిని లోపలే ఆపి ఉంచాలి. మళ్ళీ 8 అంకెలు వరకు గాలి వదిలి వేయాలి. ఇలా మూడు సార్లు చేసి రిలాక్స్ అవ్వాలి. ఇలా శ్వాస పీల్చుకోవడం వలన మన శరీరానికి, మెదడుకు కావలసిన ఆక్సిజన్ అంది, శరీరాన్ని మరింత రిలాక్స్ చేస్తుంది.

ఉపయోగాలు :
- ఏకాక్షిగత పెరుగుతుంది.
- రాయడం, చదవడం లాంటి నైపుణ్యాలు మెరుగుపడతాయి.
- కోపాన్ని అదుపులో ఉంచుతుంది.
- ఆవేశం తగ్గించి ఆలోచనా శక్తిని పెంచుతుంది.

నటరాజాసనం 
అద్భుతమైన నాట్యంతో తాండవం చేసే శివునికి మరోపేరు నటరాజు. అలాంటి నాట్య ముద్రలను పోలి ఉంటుంది కాబట్టే ఈ ఆసనానికి నటరాజాసనం అన్న పేరు వచ్చింది.

వేరియేషన్ 1
ముందుగా రెండు పాదాలు దగ్గరగా పెట్టి, చేతులు నిటారుగా ఉంచి నిల్చోవాలి. గాలి పీల్చుకుని కుడికాలిని వెనుకగా మడిచి ఎడమ కాలిని ఎడమ చేతిలో పట్టుకొని పైకి లాగాలి. కుడిచేతిని కుడి కాలుకు సమాంతరంగా ఉంచాలి. ఒక నిమిషం పాటు ఇదే స్థితిలో ఉండి మామూలు స్థితికి రావాలి. రెండు కాళ్ళతో ఇదే విధంగా 2 నుంచి 4 సార్లు చెయ్యాలి.

వేరియేషన్ 2
ముందుగా రెండు పాదాలు దగ్గరగా పెట్టి చేతులు నిటారుగా ఉంచి నిల్చోవాలి. గాలి పీల్చుకుని కుడికాలిని వెనుకగా మడిచి ఎడమ కాలిని ఎడమ చేతిలో పట్టుకొని పైకి లాగాలి. అదే సమయంలో కుడి చేతిని పైకి లేపాలి. ఎడమ కాలిని వీలున్నంతగా పైకి లేపాలి. ఇదే స్థితిలో గాలి సాధారణంగా పీలుస్తూ ఉండాలి. చూపును ఒక చోట స్థిరంగా నిలిపి ఉంచాలి. ఒక నిమిషంపాటు ఇదే స్థితిలో ఉండి మామూలు స్థితికి రావాలి. రెండు కాళ్ళతో ఇదే విధంగా 2 నుంచి 4 సార్లు చెయ్యాలి.

ఉపయోగాలు :
- ఏకాక్షిగతను పెంచుతుంది.
- చాలా సమయం కూర్చొని పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగకరం. వెన్నముకకు మంచి ప్లెక్సిబిలిటీని ఇస్తుంది.
- శరీరంలో బ్యాలెన్స్‌ను పెంచుతుంది.
- నర్వస్ సిస్టమ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
జాగ్రత్తలు :
బలహీనమైన మోకాళ్ళు ఉన్నవారు కొద్ది సమయం ప్రాక్టీస్ చేయాలి.

గమనిక
యోగా సాధనకు ముందు వార్మ్ అప్ ( సూక్ష్మవ్యాయామాలు) తప్పనిసరి. నిపుణుల ఆధ్వర్యంలో చెయ్యాలి.

0 comments:

Post a Comment