Wednesday

యాంటీ వైరస్ ఏది బెటర్...?



మీ కంప్యూటర్‌లో ఎన్నో ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయి. మీకు మధురానుభూతిని అందించే ఫోటోలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. అలాంటివన్నీ వైరస్ మూలంగా తుడిచిపెట్టుకుపోతే ఆ బాధ చెప్పనలవి కాదు. అందుకే యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈఇంటర్నెట్ ఉంటే యాంటీ వైరస్ తప్పనిసరి. లేదంటే వారం రోజులకొకసారి ఫార్మట్ చేయాల్సి వస్తుంది. సిస్టమ్ భద్రంగా ఉండాలంటే యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను తప్పకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

ఈప్రస్తుతం ఇంటర్నెట్‌లో అనేక రకాల యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని రెండు కేటగిరీలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొనే కేటగిరీకి చెందినవి, రెండవది డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేవి. ఈ రెండు కేటగిరీల సాఫ్ట్‌వేర్‌ల్లోనూ అనూకూలాంశాలు, ప్రతికూలాంశాలు ఉన్నాయి. ఈపెయిడ్ సాఫ్ట్‌వేర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. డబ్బులు చెల్లిస్తున్నారు కాబట్టి కంపెనీ నాణ్యమైన ఉత్పత్తిని అందజేస్తుంది. ఉచితంగా లభ్యమయ్యే సాఫ్ట్‌వేర్‌లో నాణ్యత ఉండకపోవచ్చనే విషయం గుర్తుంచుకోవాలి.

ఈయాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన రివ్యూస్‌ను ఇంటర్నెట్‌లో చదవండి.

ఈఒక్కొక్కరికి ఒక్కోరకమైన అవసరాలు, ప్రాధాన్యతాంశాలు ఉంటాయి. మీకు మంచిదనిపించిన సాఫ్ట్‌వేర్ ఇతరులకు నచ్చకపోవచ్చు. కాబట్టి మీ స్నేహితులు వాడుతున్న సాఫ్ట్‌వేర్ గురించి ఒకసారి ఆరాతీయండి. వారు బాగుంది అని చెబితే అందులో ఉన్న ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి. మిగతా వాటితో పోల్చితే ఎందుకు బెటర్ అనేది కనుక్కోండి.

ఈకంప్యూటర్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ప్రొగ్రామ్స్ సహాయంతో తస్కరించే హ్యాకర్లు ఇప్పుడు ఉన్నారు. క్రెడిట్ కార్డునంబర్, ఈమెయిల్ పాస్‌వర్డ్స్, ఇతర సెక్యూరిటీ ఇన్‌ఫర్మేషన్ వంటి వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతోంది. కాబట్టి ఈ తరహా మోసాల నుంచి రక్షణ కల్పించే విధంగా సాఫ్ట్‌వేర్ ఉండేలా చూసుకోండి.

ఈసులభంగా అర్థమయ్యేలా, ఇన్‌స్టాల్ చేసుకునేలా, ఉపయోగించుకునేలా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోండి.

ఈయాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ కంప్యూటర్‌కు పూర్తి రక్షణ కల్పించేలా ఉండాలి. వైరస్‌ను గుర్తించడమే కాకుండా వెంటనే రిమూవ్ చేసేదిగా ఉండాలి.

ఈఫిషింగ్ అటాక్స్ ఈ రోజులో సాధారణమై పోయింది. వెబ్‌సైట్ సేఫ్, సెక్యూర్డ్ కాకపోయినట్లయితే వెంటనే బ్లాక్ చేసేలా సాఫ్ట్‌వేర్ ఉండాలి.

ఈఅటోమెటిక్ అప్‌డేట్స్, స్కాన్ అయ్యేలా ఫీచర్స్ ఉండాలి. దీనివల్ల మీ కంప్యూటర్‌కు సైబర్ అటాక్స్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది.

ఈకస్టమర్ సపోర్ట్ బాగా ఉన్న కంపెనీ ప్రోడక్ట్‌ని ఎంచుకోవాలి. ఫోన్, మెయిల్ ద్వారా టెక్నికల్ సపోర్టు సౌలభ్యం ఉన్న ప్రోడక్ట్ తీసుకోవాలి.

0 comments:

Post a Comment