Wednesday

నిగ్రహం కోల్పోకుండా...


పాలవాడు రావడం ఆలస్యమైందా? పళ్లు పటపట కొరక్కండి!పేపర్‌బాయ్ విసిరిన న్యూస్‌పేపర్ నీళ్లలో పడిపోయిందా? కోపంతో రంకెలు వేయకండి! ఆఫీసుకు వెళుతుండగా మీ బండి పంచరైందా? ఎవరిని నిందించాలో తెలియక మిమల్ని మీరే తిట్టుకోకండి! ఆఫీసులో బాస్ కోప్పడ్డాడా? ఆ అక్కసును మీ కింది ఉద్యోగుల మీద చూపెట్టకండి! సాయంత్రం ఇంటికి వెళ్లగానే మీ శ్రీమతి తెమ్మన్న వస్తువు మరచిపోయారా? మీ మతిమరుపును మీరే నిందించుకోకండి! తెల్లవారిందగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా మన సహనానికి పరీక్ష పెట్టే సంఘటనలు చాలా జరుగుతుంటాయి. మనకు నచ్చని పనులు, బాధపెట్టే విషయాలు మనకు చాలానే ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకోలేక ఆత్మ నిగ్రహాన్ని కోల్పోతుంటాం.

దీని వల్ల మన బ్లడ్‌ప్రెషర్‌ని పెంచేసుకుని పక్కవారిపై చిందులు వేస్తుంటాం. అలా చేయడం వల్ల మనకే నష్టమంటున్నారు ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్లు. మన ఆత్మనిగ్రహం ఒక కండరం లాంటిదని, దాన్ని శక్తివంతం చేసుకోవడానికి మన ఆలోచనా విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఠిమీ మనసుకు నచ్చనివి, మీ స్వభావానికి విరుద్ధమైనటువంటి పనులేవీ చేయకండి.

ఠిమీకు ఏ విషయంలోనైనా పట్టలేని ఆగ్రహం వచ్చినపుడు వెంటనే మీకు సంబంధం లేని, అంతగా పరిచయం లేని కొత్త విషయాన్ని గురించి ఆలోచించండి. ఠిప్రతి ఒక్కరికి కొన్ని తీరని కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకునే మార్గం కూడా ఉండదు. దీంతో ఆత్మనిగ్రహాన్ని కోల్పోతారు. అటువంటి పరిస్థితి ఎదురైనపుడు చేస్తున్న పని మీదనే దృష్టిని నిమగ్నం చేయండి. అవసరమైతే ఆ పూటకు భోజనం మానేయండి. దీంతో ధ్యాస ఇతర విషయాలపైకి మళ్లదు.

0 comments:

Post a Comment