జపాన్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0 గా నమోదైంది. దీని ప్రభావంతో టోక్యోతో పాటు సమీప ప్రాంతాల్లో భవనాలు ఊగాయి. టోక్యోకు 560 కిలోమీటర్ల దూరంలోని టొరిషిమా ప్రాంతంలో భూకంపక కేంద్రం నెలకొంది. గతేడాది సునామీ విపత్తుతో అతలాకుతలమైన జపాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
0 comments:
Post a Comment