యుద్ధ విమానాలు, బాంబులతో దాడులు చేసే కాలం పోయిందిప్పుడు! శత్రు దేశాల కంప్యూటర్ నెట్‌వర్కులపై సైబర్ దాడులతోనే యుద్ధం కన్నా తీవ్ర నష్టం కలిగించవచ్చు. అందుకే ఇలాంటి ముప్పును కూడా ఎదుర్కోడానికి జపాన్ ముందే సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ఓ 'సైబర్ వెపన్'ను సిద్ధం చేసుకుంటోంది! తమ నెట్‌వర్కులపై సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు శక్తివంతమైన వైరస్‌ను అభివృద్ధి చేస్తోంది. సై బర్ దాడి జరిగితే వెంటనే దాని మూలాలను వెతుక్కుంటూ వెళ్లి ఆ ప్రోగ్రాంను నాశనం చే సే శక్తివంతమైన సాఫ్ట్‌వేర్ కోడ్‌ను నిపుణులు రూపొందిస్తున్నారు.
ఈ మూడేళ్ల ప్రా జెక్టు కోసం 23 లక్షల డాలర్లను (సుమారు రూ. 11కోట్లు) ప్రభుత్వం కేటాయించింది. ఫుజి ట్సు లిమిటెడ్ అనే టెక్నాలజీ కంపెనీ సహకారంతో ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్, ఇత ర పరికరాలను జపాన్ రూపొందిస్తోంది. ఈ వైరస్‌ను తయారుచేయడానికి చట్టంలో సవరణలు చేయడానికి కూడా జపాన్ సిద్ధమైంది. అమెరికా, చైనాలు ఇప్పటికే ఇలాంటి 'సైబర్ వెపన్'ను ఉపయోగిస్తున్నాయని స్థానిక మీడియా పేర్కొంది.
0 comments:
Post a Comment