Monday

భారత్‌కు నకిలీ 'చైనా' భారత్‌లోని ప్రసిద్ధ బ్రాండ్లకు నకిలీల తయార్


ఐఫోన్‌తో సరిసమానమైన ఫోన్ ను సరసమైన ధరకు పొందాలనుకొంటే మనలో ఎక్కువ మంది చైనా సెల్‌ఫోన్లను ఆశ్రయిస్తారు. అంతేకాదు చిన్నారులు ఆడుకొనే ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు, కంప్యూటర్ హార్డ్‌వేర్ తదితరాలను కూడా కారుచౌకగా కొనాలనుకొన్నప్పుడు.. చైనా తయారు చేసిన వాటి వైపే మనం మొగ్గు చూపుతాం. చైనాలో తయారైన వస్తువులకు మన దేశంలో ఉన్న డిమాండ్ అలాంటిది మరి. మనమంతా చైనా వస్తువుల కోసం ఎగబడుతుంటే.. చైనా కంపెనీలే మో మన దేశంలో పేరు మోసిన వ్యాపార సంస్థల ఉత్పత్తుల నకిలీలను తయారు చేయడంలో మునిగిపోతున్నా యి.

అంతేకాదు.. ఆ నకిలీలను తెచ్చి ఏకంగా మన దేశంలోనే అమ్ముతున్నాయి కూడా. వినియోగ వస్తువుల (కన్సూమర్ గుడ్స్) తయారీలో మన దేశంలో అగ్రగామి సంస్థలైన దాబర్ ఇండియా, ఐటీసీ వంటి సంస్థలు తయారు చేసే తలనూనెలు, సబ్బులు, పౌడర్లు వంటి వాటి నకిలీలను చైనా సంస్థలు తయారు చేస్తున్నాయి. అంతేకాదు దాబర్, ఐటీసీ అనే బ్రాండ్ల పేరుతోనే ఈ నకిలీలను మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ విక్రయిస్తున్నాయి. ఆ ఫలితంగా మన దేశంలోని వ్యాపార సంస్థలకు ప్రతి ఏటా రూ. 500 కోట్ల నష్టం వస్తోంది.

"మా సంస్థ ఉత్పత్తుల పేరుతో.. అనేక నకిలీ ఉత్పత్తులు చైనా లో పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. చైనాలో దాదాపు 20 ప్రదేశాల్లో ఈ నకిలీ వస్తువులను మేం పట్టుకున్నాం. కానీ.. అక్కడి సర్కారు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. మేడ్ ఇన్ ఇండియా పేరుతో తయారు చే స్తున్న ఈ నకిలీ ఉత్పత్తులను భారత్‌తో పాటు ఆఫ్రికా దే శాల్లో అమ్ముతున్నారు.

ఇవి నాసిరకంగా ఉంటూ మా బ్రాండ్లకు అప్రతిష్ఠ తెస్తున్నాయి'' అని దాబర్ ఇండియా సంస్థ ఫైనాన్స్ మేనేజర్ అశోక్ జైన్ చెప్పారు. అలాగే ఐ టీసీ సంస్థలో ఉన్నతాధికారి అయిన ప్రదీప్ దీక్షిత్ కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేశారు. తమ కంపెనీ త యారు చేస్తున్న ప్రసిద్ధ వినియోగ వస్తువులకు చైనా కం పెనీలు నకీలలను తయారు చేస్తున్నాయన్నారు. "మేం తయారు చేసే ప్రసిద్ధ సిగరెట్ బ్రాండ్‌ను చైనా కంపెనీలు కాపీ కొడుతూ.. నకిలీలను రూపొందించి.. ఛత్తీస్‌గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పెద్దఎత్తున విక్రయిస్తున్నాయి'' అని చెప్పారు.

ప్రాణాంతక మందులు
దేశంలో వినియోగ వస్తువుల తయారీదార్లకు చైనా న కిలీలు పెను సవాలుగా మారాయని కేంద్ర ఎక్సైజ్, కస్ట మ్స్ బోర్డు చైర్మన్ ఎస్.కె.గోయల్ అన్నారు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నోకియా, అడిడాస్, రీబాక్, నివ్యా వంటి బ్రాండ్లకు కూడా చైనా కంపెనీలు నకిలీ ఉత్పత్తులను రూపొందించి.. మన దేశంతో పాటు విదేశాల్లోనూ పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయని చెప్పారు. ఇక.. మన దేశంలోని కంపెనీలు తయారు చేసే ఔషధాలకు కూడా నకిలీలను రూపొందిస్తున్నాయి. 'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో చైనా నుంచి రవాణా అవుతున్న నకి లీ ఔషధాలను ఆఫ్రికా దేశాల్లో ఇటీవల పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం.

దేశంలోని ప్రసిద్ధ బ్రాండ్ల పేరు మీద తయారైన అనే క నకిలీ ఉత్పత్తులను దేశ రాజధానిలో తాము ఇటీవల పెద్ద ఎత్తున పట్టుకొన్నామని ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కె.కె.వ్యాస్ తెలిపారు. కాగా.. నకిలీ ఉత్పత్తులు, స్మగ్లింగ్, మత్తుమందుల అక్రమ రవాణా, బ్యాంకులను ముంచడం, పన్నులు ఎగవేయడం, అవినీతి వంటి వాటి వల్ల దేశ ఖజానాకు ఏటా రూ. 22,528 కోట్ల నష్టం వస్తోందని ఇండియా ఫోరెన్సిక్ ఫౌండేషన్ అనే సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

0 comments:

Post a Comment