భ్రమరము చేసే ఝంకారము లాగా ఉంటుంది కాబట్టి దీనికి భ్రమరీ ప్రాణాయామం అని పేరు. దీని నుంచి ఉత్పన్నమయ్యే వైబ్రేషన్స్ మన నాడీ వ్యవస్థకు, మెదడుకు మంచి రిలాక్సేషన్‌ను ఇస్తుంది. రిలాక్స్‌డ్‌గా వజ్రాసనంలో కూర్చోవాలి. కళ్లు మూసుకుని శరీరాన్ని అంతా రిలాక్స్‌డ్‌గా ఉంచాలి. నెమ్మదిగా రెండు చేతులను మోచేతి వద్ద వంచాలి. బొటనవేళ్లతో చెవులను మూయాలి. మధ్య, ఉంగరం వేళ్లను కళ్ల మీద ఆన్చాలి. చూపుడు వేలు నుదుటిమీద వచ్చేట్లు ఉంచాలి. ఇప్పుడు దీర్ఘంగా గాలి పీల్చుకుని ఓం లాంటి శబ్దం చేస్తూ గాలి వదలాలి. ఇది చేస్తున్నంత సేపు నోరు మూసి ఉంచాలి. దీనిని 10 - 12 సార్లు రిపీట్ చేయాలి.
ఉపయోగాలు :
- డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.
- హైబీపీ ఉన్నవారికి మంచిది.
- గొంతుకు సంబంధించిన రుగ్మతలను తగ్గిస్తుంది. (స్వరపేటిక, థైరాయిడ్)
- మెదడుకు విశ్రాంతినిస్తుంది.
- విద్యార్థులు బాగా చదివి అలసిపోయినప్పుడు ఈ ఆసనం చేస్తే మంచిది.
ఇటీవలి కాలంలో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య బ్యాక్ పెయిన్, సయాటికా. యోగాలోని ఒక భాగమైన శలభాసనం ఈ బాధలనుంచి చాలా వరకు విముక్తి కలిగిస్తుంది. ముందుగా ఏకపాద శలభాసనంతో మొదలుపెట్టి నెమ్మదిగా పూర్ణ శలభాసనం ప్రయత్నించవచ్చు. గొల్లభామను పోలి ఉంటుంది కాబట్టి దీనికి శలభాసనం అని పేరు వచ్చింది.
ఏకపాద శలభాసనం (అర్థ శలభాసనం)
ముందుగా బోర్లా పడుకోవాలి. చుబుకం నేలకు ఆనేట్లుగా ఉంచాలి. చేతులు కాళ్ల కిందుగా ఉంచాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుని కుడికాలును వీలున్నంత పైకి లేపి 5-8 సెకన్ల పాటు ఆ స్థితిలో ఉంచాలి. గాలి వదిలేస్తూ నెమ్మదిగా కాలు కిందికి తీసుకురావాలి. కాలుపైకి లేపినప్పుడు మోకాలి వద్ద వంచకుండా ఉండాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమకాలితో కూడా మూడుసార్లు చేయాలి.
పూర్ణ శలభాసనం
ముందుగా బోర్లా పడుకోవాలి. చుబుకం నేలకు ఆనేట్లుగా ఉంచాలి. చేతులు కాళ్ల కిందుగా ఉంచాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుని రెండు పాదాలను మోకాలి వద్ద వంచకుండా వీలున్నంతపైకి ఎ త్తాలి. ఆ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. మొదట్లో కొద్దిగా మాత్రమే ఎత్తగలిగినా... సాధన చేసేకొద్దీ ఇంకా ఎక్కువ పైకి ఎత్తగలుగుతారు. నడుము, పొట్ట దగ్గర కండరాలు శక్తివంతం అవుతున్న కొద్దీ కాళ్లు ఎక్కువగా లేపి ఉంచగలుగుతారు. ఎక్కువ సమయం ఉండగలుగుతారు.
ఉపయోగాలు :
- కాళ్లను, కాలి కండరాలను శక్తివంతం చేస్తుంది. ఋతు సంబంధమైన సమస్యలకు మంచిది.
- బ్యాక్ పెయిన్‌ను, సయాటికా నొప్పిని తగ్గిస్తుంది. s వెన్నెముక దృఢంగా ఉంటుంది.
- జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది.
- మూత్రాశయాన్ని శక్తివంతం చేస్తుంది.
- డెలివరీ తర్వాత మహిళలో వచ్చే నడుంనొప్పి నివారణకు బాగా ఉపయోగపడుతుంది.
0 comments:
Post a Comment