Thursday

ఇష్టంగా కష్టపడితే..

ఆసనాలు వేసేటప్పుడు మనం ఏవిధమైన మానసిక స్థితిలో ఉంటే అదే విధమైన స్థితి ఉత్తేజితం అవుతుంది. కాబట్టి యోగా చేసేటప్పుడు ఇష్టంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ ఉష్ట్రాసనం ఒకేసారి పూర్తిస్థాయిలో చేయడం కష్టం. అందుకే మొదటగా ఏక పాదంతో మొదపూట్టి, రెండు పాదాలతో ప్రయత్నించవచ్చు. 


ఏకపాద ఉష్ట్రాసనం 
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచాలి. వెనుకగా పాదాలను వేళ్లు భూమికి ఆనేటట్లుగా ఉంచాలి. ఒక చేతిని నడుము మీద ఉంచి రెండో చేతిని వెనుకగా తిప్పి కాలి మడమను పట్టుకోవాలి. గాలి పీల్చుకుని నడుమును ముందుకు తోచాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో సాధారణంగా గాలి పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలి వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా రెండు వైపులా మూడుసార్లు చేయాలి.

ఉష్ట్రాసనం - 1
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచాలి. వెనుకగా పాదాలను వేళ్లు భూమికి ఆనేటట్లుగా ఉంచాలి. రెండు చేతులను వెనుకగా తిప్పి కాలి మడమలను పట్టుకోవాలి. గాలి పీల్చుకుని నడుమును ముందుకు తోచాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో సాధారణంగా గాలి పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలి వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.

ఉష్ట్రాసనం - 2
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచాలి. వెనుకగా పాదాలను వేళ్లు భూమికి ఆనేటట్లుగా ఉంచాలి. రెండు చేతులను వెనుకగా తిప్పి, అరచేతులను అరికాళ్లపై ఆన్చాలి. గాలి పీల్చుకుని నడుమును ముందుకు తోచాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో సాధారణంగా గాలి పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలి వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.

ఉష్ట్రాసనం - 3
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచాలి. వెనుకగా పాదాలను వేళ్లు భూమికి ఆనేటట్లుగా ఉంచాలి. రెండు చేతులను వెనుకగా తిప్పి అరికాళ్లకు తగలకుండా... కాళ్లకు సమాంతరంగా నేలకు ఆన్చాలి. గాలి పీల్చుకుని నడుమును ముందుకు తోచాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో సాధారణంగా గాలి పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలి వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.

ఉపయోగాలు :
+ వెన్నెముకను దృఢపరుస్తుంది.
+ ఊపిరితిత్తుల పనితీరును బాగా మెరుగుపరుస్తుంది.
+ థైరాయిడ్ గ్రంథి పనితీరును క్రమబద్ధీకరిస్తుంది.
జాగ్రత్తలు :
గుండె జబ్బులు, హెర్నియా, వెన్నెముక సమస్యలు ఉన్న వారు చేయకూడదు.

0 comments:

Post a Comment