పాకిస్థాన్‌లోని ఖైబర్ మన్యంలోని జమ్రుద్ మార్కెట్‌లో మంగళవారం ఓ ట్రక్కు బాంబు పేలి 35 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. ఈ భారీ పేలుడు ధాటికి ఓ పెట్రోలు బంకు, పలు వాహనాలు దగ్ధమయ్యాయి. తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ), లష్కరే ఇస్లాం వంటి పలు ఉగ్రవాద సంస్థ లు కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ఈ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడుకు ఇంతవరకు ఎవరూ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
అయితే, తాలిబన్ వ్యతిరేక మిలీషియా ఉగ్రవాదులు ఈ మార్కెట్ దారిలో పోతుం టే ఈ పేలుడు సంభవించిందని చెపుతున్నారు. ఈ ప్రాంతంలో తమ వర్గం వాళ్ల మీద దాడులు చేస్తున్న వారిని వదలిపెట్టమని, వారిపై ప్రతిదాడులు చేస్తామంటూ ఇటీవలే టీటీపీ హెచ్చరించింది.

0 comments:
Post a Comment