Wednesday

గిలానీ నిజాయితీపరుడు కాదు..


పాకిస్థాన్ ప్రభుత్వానికి మరో సంక్షోభం వచ్చిపడింది. మెమోగేట్ అంశంతో ఇప్పటికే అప్రతిష్ఠను మూటగట్టుకున్న అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ప్రముఖులకు సంబండ ధించి అవినీతి కేసును తిరగదోడాలని ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవి చేపట్టిన ప్రధాని గిలానీ నియమాలను తుంగలో తొక్కారని.. ఆయన నిజాయితీపరుడు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

ఇందుకు బాధ్యులుగా అధ్య క్షుడు జర్దారీ, ప్రధాని గిలానీపై చర్యలు తప్పవని మంగళవారం సుప్రీం కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం అవినీతి పరులకు కొమ్ముకాస్తూ వారందరికి క్షమాభిక్ష ప్రసాదించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్దారీకి కూడా కేసు నుంచి విముక్తి కల్పించారని మండిపడింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ తీర్పునిచ్చింది. అత్యున్నత రాజ్యాంగ విలువలను కాదని.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కే విశ్వాసంగా నిలుస్తున్న గిలానీ ప్రధాని పదవికి అర్హుడు కాదని మండిపడింది. 

ఈ సందర్భంగా ధర్మాసనం ఆరు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచింది. అందులో ప్రధాని గిలానీపై చర్యలు తీసుకోవడంతో పాటు.. ఐదేళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలని.. జర్దారీ కేసును పరిశీలించేందుకు చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌధురికి అప్పగించాలని తెలిపింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో అతిపెద్ద ధర్మాసనం జనవరి 16వ తేదీన ఈ కేసును విచారించాలని ధర్మాసనం సిఫారసు చేసింది. వ చ్చే విచారణలోపు ప్రభుత్వ ఉద్దేశమేంటో తెలపాలని అటార్నీ జనరల్ అన్వర్ ఉల్ హక్‌ను ధర్మాసనం అడిగింది.

0 comments:

Post a Comment